శంకర్ టు నెల్సన్.. తమిళంలో ఎక్కువ పారితోషికం తీసుకునే దర్శకులు వీళ్ళే..!

తెలుగు ప్రేక్షకులు.. ఇక్కడి స్టార్ హీరోలతో సమానంగా పక్క భాషల్లోని స్టార్ హీరోలను ఎవర్నైనా ఆదరించారా? అంటే నిస్సందేహంగా తమిళ హీరోలను, దర్శకులను ఆదరించారు అని చెప్పొచ్చు. ఇప్పుడంటే ఓటీటీల దయవల్ల అన్ని భాషల్లోని దర్శకులు జనాలకు తెలుస్తున్నారు. పైగా వాళ్ళ సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. ఒకప్పుడు ఎక్కువగా తమిళ సినిమాలే తెలుగులోకి డబ్బింగ్ అయ్యేవి. ఎన్నో సినిమాలను మనవాళ్ళు బ్లాక్ బస్టర్లుగా నిలబెట్టారు. అక్కడి దర్శకుల సినిమాలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే తెలుగు దర్శకులకు కూడా భారీ ఎత్తున పారితోషికం కట్టబెడుతుంటారు ఇక్కడి నిర్మాతలు. మరి తమిళ దర్శకులకు ఏ రేంజ్లో పారితోషికాలు ఇస్తారు అనే డౌట్ అందరిలోనూ ఉంది. నిజానికి ఒకప్పుడు తెలుగు కంటే తమిళ ఇండస్ట్రీ పెద్దది. కాబట్టి అక్కడి స్టార్ డైరెక్టర్లకు కూడా భారీగా పారితోషికాలు ఇచ్చేవారు. మరి ఇప్పుడు తమిళంలో ఎక్కువ పారితోషికం అందుకునే దర్శకులు ఎవరు అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1) శంకర్ :

ఈయన సినిమాలు మన తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా ఇష్టం. చెప్పుకోవాలంటే మొదటి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ఇతను అని చెప్పొచ్చు. ఇతను ఇప్పటికీ ఒక్కో సినిమాకి రూ.60 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు.

2) మణిరత్నం :

ఎన్నో ప్లాపులు ఎదురైనప్పటికీ మణిరత్నం డిమాండ్ తగ్గలేదు. అది ఎందుకు అనేది ‘పొన్నియన్ సెల్వన్ -1’ తో ప్రూవ్ అయ్యింది. ఈ మూవీ అక్కడ రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి.. చరిత్ర సృష్టించింది. ఈయన ఒక్కో సినిమాకి రూ.10 కోట్లు పారితోషికం అందుకోవడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తూ లాభాల్లో వాటా కూడా తీసుకుంటూ ఉంటారు.

3) అట్లీ :

శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఇతను..తీసిన అన్ని సినిమాలు హిట్లే. ఇప్పుడు ఏకంగా షారుఖ్ తో మూవీ చేస్తున్నాడు. అందుకే ఇతను రూ.50 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తుంది.

4) మురుగదాస్ :

తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే అదే స్టార్ డంని కొనసాగిస్తున్నారు మురుగదాస్. ఈయన ఒక్కో సినిమాకి రూ.30 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు అని వినికిడి. ఈయన సినిమాలకు మలయాళంలో కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకే ఇతనికి అంత డిమాండ్.

5) లోకేష్ కనగరాజ్ :

సైలెంట్ గా ‘ఖైదీ’ ‘విక్రమ్’ చిత్రాలతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. అందుకే ఇతను రూ.25 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్టు వినికిడి.

6) వెట్రిమారన్ :

అసురన్, ఆడుకలం.. వంటి చిత్రాలతో ఇతను కూడా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అందుకే ఇతను ఒక్కో సినిమాకి రూ.20 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్టు వినికిడి.

7) శివ :

తెలుగు సినిమాలతో డైరెక్టర్ గా మారి ఇప్పుడు కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాడు. ఇతను ఒక్కో సినిమాకి రూ.15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్టు వినికిడి.

8) మోహన్ రాజా :

మన ఎడిటర్ రాజా గారి పెద్దబ్బాయి.. మోహన్ రాజా కూడా అక్కడ స్టార్ డైరెక్టరే..! ఇతను కూడా ఒక్కో సినిమాకి రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు.

9) హెచ్.వినోద్ :

‘ఖాకీ’ ‘వలీమై’ వంటి చిత్రాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు వినోద్. ఇతను ఒక్కో సినిమాకి రూ.8 కోట్ల నుండి రూ.10 కోట్లు అందుకుంటున్నట్టు వినికిడి.

10) నెల్సన్ దిలీప్ కుమార్ :

‘డాక్టర్’ ‘బీస్ట్’ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు రజినీకాంత్ తో సినిమా చేస్తున్నాడు. ఇతను ఒక్కో సినిమాకి రూ.8 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్టు వినికిడి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus