తాజాగా హైదరాబాద్ ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ జాబితాను ‘హైదరాబాద్ టైమ్స్’ ప్రకటించింది. ఈ లిస్ట్ లో టాలీవుడ్ నుండీ అదితిరావు హైదరి అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ఈ లిస్ట్ లో మొత్తం 25 మంది మహిళా సెలబ్రిటీలు ఉన్నారు. మీరు కలలో ఎవర్ని ఎక్కువగా ఊహించుకొంటారు అనేదాని పై కొందరు కుర్రాళ్లను అడిగి చేసే సర్వే ఆధారంగా ప్రకటించే లిస్టే ఈ “మోస్ట్ డిజైరబుల్ ఉమెన్” అన్నమాట. ఇక ఈ లిస్ట్ లో మొదటి స్థానాన్ని ‘సమ్మోహనం’ ఫేమ్ అదితి రావు హైదరి కైవసం చేసుకోగా సమంత మూడో స్థానంలో నిలిచింది.
ఇక మిస్ ఇండియా 2018 రన్నరప్‌గా నిలిచిన శ్రేయారావు కామవరపు రెండో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. పూజా హెగ్డే, రష్మిక మందన వరసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. కాగా, ఇక ‘హైదరాబాద్ టైమ్స్’ విడుదల చేసిన ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ లిస్ట్ ఇదే :
1. అదితిరావు హైదరి : ‘సమ్మోహనం’ చిత్రంతో టాలీవుడ్ కి ప్రేక్షకులకి దగ్గరైన ఈ భామ అంతకు ముందు మణిరత్నం- కార్తీ కాంబినేషన్లో వచ్చిన ‘చెలియా’ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టినప్పటికీ.. ఆ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో తెలుగు ప్రేక్షకులందరికీ అదితి పేరు పెద్దగా తెలీదు. అదితిరావు హైదరి తెలంగాణ మూలాలు ఉన్న అమ్మాయి. నిజాం హయాంలోని హైదరాబాద్ సంస్థానానికి ప్రధాన మంత్రిగా పనిచేసిన సర్ అక్బర్ హైదరికి అదితిరావు మునిమనవరాలు అన్న సంగతి తెలిసిందే. అదేవిధంగా… వనపర్తి సంస్థానం రాజా రామేశ్వరరావుకు కూడా ఈమె మనవరాలు. ఇషాన్ హైదరి, విద్యారావుల కుమార్తె. విద్యారావు ప్రముఖ క్లాసికల్ సింగర్, రైటర్. ఇక ‘హైదరాబాద్ టైమ్స్’ విడుదల చేసిన ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ లిస్ట్ లో మొదటి స్థానం కైవసం చేసుకుంది అదితి.
2. శ్రేయారావు కామవరపు :
గతేడాది ముంబయిలో జరిగిన ఫెమినా మిస్ ఇండియా-2018 అందాల పోటీల ఫైనల్స్‌లో తెలుగు అమ్మాయి శ్రేయారావు కామవరపు రెండవ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ‘హైదరాబాద్ టైమ్స్’ విడుదల చేసిన ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ లిస్ట్ లో రెండవ స్థానం దక్కించుకుంది శ్రేయా.
3. సమంత అక్కినేని :
‘ఏమాయ చేసావే’ చిత్రంతో టాలీవుడ్ పరిచయమయ్యి స్టార్ హీరొయిన్ గా ఎదిగింది సమంత. 2017 లో నాగచైతన్య ను వివాహం చేసుకుని అక్కినేని కోడలయ్యింది. పెళ్ళయ్యాక కూడా కథాబలం ఉన్న చిత్రాల్ని ఎంచుకుంటూ ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక ‘హైదరాబాద్ టైమ్స్’ విడుదల చేసిన ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ లిస్ట్ లో మూడవ స్థానం దక్కించుకుంది సమంత.
4. పూజా హెగ్దే : నాగచైతన్య హీరోగా వచ్చిన ‘ఒక లైలా కోసం’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యింది పూజా హెగ్దే. ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. మహేష్ బాబు మహర్షి చిత్రంలో కూడా పూజా నే హీరోయిన్. ఇక ‘హైదరాబాద్ టైమ్స్’ విడుదల చేసిన ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ లిస్ట్ లో నాలుగవ స్థానం దక్కించుకుంది పూజా.
5. రష్మిక మందన : ‘ఛలో’ ‘గీతగోవిందం’ ‘దేవదాస్’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ‘గోల్డెన్ లెగ్’ గా మారిపోయింది రష్మిక మందన. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తుంది. ఇక ‘హైదరాబాద్ టైమ్స్’ విడుదల చేసిన ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ లిస్ట్ లో అయిదవ స్థానం దక్కించుకుంది ఈ కన్నడ భామ.
6. కామాక్షి భాస్కర్ల :
గతేడాది ‘మిస్ ఇండియా’ పోటీల్లో పాల్గొన్న హైదరాబాద్ అమ్మాయి కామాక్షి భాస్కర్ల. గతంలో ‘మిస్ ఫ్రెష్ ఫేస్ పోటీలో’ టైటిల్ విన్నర్ కాగా .. మిస్ ప్లానెట్ – 2017 టైటిల్ విన్నర్ కూడా అయ్యింది. ఇక ‘హైదరాబాద్ టైమ్స్’ విడుదల చేసిన ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ లిస్ట్ లో ఆరవ స్థానాన్ని దక్కించుకుంది.
7. పీవీ సింధు : 2016 ఒలింపిక్స్‌లో మహిళల సింగల్స్ బ్యాడ్‌మింటన్‌లో ద్వితీయ స్థానం పొంది భారత్‌కు తొలి మరియు ఏకైక రజత పతకాన్ని సంపాదించిపెట్టిన పి. వి. సింధు పూర్తీ పేరు పూసర్ల వెంకట సింధు. ‘హైదరాబాద్ టైమ్స్’ విడుదల చేసిన ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ లిస్ట్ లో ఏడవ స్థానాన్ని దక్కించుకుంది సింధు.
8. కైరా అద్వానీ : మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయ్యింది కైరా అద్వానీ. బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన ‘ఎం.ఎస్.ధోని’ బయోపిక్ లో నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ భామను టాలీవుడ్ కి తీసుకొచ్చారు డైరెక్టర్ కొరటాల శివ. వరుసగా స్టార్ హీరోల సరసన దక్కించుకుంటున్న ఈ భామకి ‘హైదరాబాద్ టైమ్స్’ విడుదల చేసిన ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ లిస్ట్ లో ఎనిమిదవ స్థానం దక్కింది.
9. రకుల్ ప్రీత్ సింగ్: ‘కెరటం’ అనే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన రకుల్ తరువాత వచ్చిన ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ‘లౌక్యం’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత తెలుగులో ఒక్క పవన్ కళ్యాణ్ మినహాయిస్తే… అందరి స్టార్ హీరోల సరసన నటించింది. ఈ గ్లామర్ క్వీన్ కు ‘హైదరాబాద్ టైమ్స్’ విడుదల చేసిన ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ లిస్ట్ లో తొమ్మిదవ స్థానం దక్కింది.
10. కాజల్ అగర్వాల్ : ‘చందమామ’ కాజల్ ఇప్పటికీ యువ హీరోయిన్లకి మంచి పోటీనిస్తూ సౌత్ లో ఇప్పటికీ అగ్రహీరోయిన్ గా కొనసాగుతుంది. ‘హైదరాబాద్ టైమ్స్’ విడుదల చేసిన ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ లిస్ట్ లో పదవ స్థానాన్ని దక్కించుకుంది కాజల్.
11. పాయల్ రాజ్‌పుత్ : ‘ఆర్.ఎక్స్. 100’ చిత్రంలో తన గ్లామర్ తోనూ నటనతోనూ మంచి మార్కులు కొట్టేసింది ఈ భామ. ‘హైదరాబాద్ టైమ్స్’ విడుదల చేసిన ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ లిస్ట్ లో పదకొండవ స్థానాన్ని దక్కించుకుంది పాయల్.