సినిమా అంటే..ఎంటర్‌టైన్‌మెంట్..సినిమా అంటే…ఆహ్లాదమ్…సినిమా అంటే టైమ్ పాస్…సినిమా అంటే రిలాక్స్ కోసం చూసేది…నిజమే సగటు ప్రేక్షకుడి ఆలోచనకు తగ్గట్టే సినిమాలు తెరకెక్కుతున్నాయి….అందులో కొన్ని కుటుంబ కధలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంటే…మరికొన్ని హాస్యరస ప్రధానమైన చిత్రాలుగా తెరకెక్కి ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్నాయి. ఇక మరికొన్ని యాక్షన్ తో నాలాలు తెగిపోయే సస్పెన్స్ తో సాగేవి. అయితే ఇవన్నీ కల్పించిన కధలు, దర్శకుల ఆలోచనల్లో నుంచి పుట్టిన కధలు…ఇదిలా ఉంటే ఇదే సినిమాను యధార్ధ గాధల ఆధారంగా తెరకెక్కిస్తే?? కొన్ని జీవితాల సారాంశాన్ని తెరపై ఆవిష్కరిస్తే…భలే ఉంటుంది కదా….మరి ఇంకేంటి ఆలస్యం యధార్ధ గాధలే సినిమాలుగా తెరకెక్కిన కొన్నింటిని ఒక లుక్ వేద్దాం రండి.
గాంధీ (1982)మన జాతిపిత “గాంధీ”జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను రిచర్డ్ అటన్ బోరోగ్ తెరకెక్కించారు. 1983లో ఈ సినిమాకు దాదాపుగా 8ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి.
బార్డర్ (1997)1971లో జరిగిన భారత్- పాకిస్తాన్ యుద్ద నేపధ్యమే ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం. ఈ చిత్రానికి జేపీ. దత్తా దర్శకత్వం వహించాడు. దాదాపుగా 120మంది భారత సైన్యం పాక్ సైన్యాన్ని ఎలా ఎదుర్కుంది అన్న నేపధ్యమే ఈ సినిమా. ఈ సినిమా రెండు జాతీయ అవార్డ్స్ మాత్రమే కాకుండా నాలుగు ఫిల్మ్ ఫేర్స్ ను సైతం సొంతం చేసుకుంది.
ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002)తెల్లవారికి ఎదురొడ్డి మనకు స్వతంత్ర్యాన్ని అందించిన ఎందరో మహానుబావుల్లో భగత్ సింగ్ ఒకరు. ఆయన జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈ చిత్రం రెండు జాతీయ స్థాయి అవార్డ్స్ ను సొంతం చేసుకుంది.
బోస్ – ద ఫర్గాటన్ హీరో (2004)సచిన ఖేడేకర్ ప్రధాన పాత్రలో, సుబాష్ చంద్ర బోస్ జీవిత గాధను తెరకెక్కించాడు దర్శకుడు శ్యాం బెనెగల్. ఈ సినిమాకు ఆర్ట్ డిపార్ట్‌మెంట్ లో ఒక జాతీయ పురస్కారం దక్కడం విశేషం.
గురు (2007)ప్రఖ్యాత బిజినెస్ మ్యాన్ ధీరు భాయ్ అంబానీ జీవిత కధ ఆధారంగా, ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చిత్రం. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో నటించారు.
డర్టీ పిక్చర్ (2011)ఐటమ్ భామగా పేరు తెచ్చుకున్న బ్యూటీ సిల్క్ స్మిత జీవిత కధ ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం. ఈ సినిమాలో సిల్క్ పాత్రను విద్యాబాలన్ చెయ్యగా, సినిమాను మిలాన్ లుత్రియ అనే దర్శకుడు తెరకెక్కించాడు.
బాగ్ మిల్కా బాగ్ (2013)మిల్కా సింగ్ అనే జాతీయ స్థాయి ఒలింపిక్ రన్నర్ జీవిత కధ ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం. మిల్కా పాత్రను ఫర్హాన్ అఖ్తర్ పోషించగా, రాకెయ్ష్ ఒంప్రకాష్ మెహ్రా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డ్స్ తో పాటు మరికొన్ని పురస్కారాలు దక్కాయి.
పాన్ సింగ్ తోమార్ (2013)భారత జాతీయ క్రీడల్లో గోల్డ్ మెడల్ సంపాదించిన ఒక వ్యక్తిని బలవంతంగా బంధిపోటుగా మార్చే కధ ఇది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో ఇర్ఫాన్ ఖాన్ నటించాడు. ఈ సినిమా అనేక అవార్డ్స్ ను సొంతం చేసుకుంది.
ద అటాక్స్ ఆఫ్ 26/11 (2013)నవంబర్ 26న జరిగిన ముంబై మారణహోమం ఆధారంగా, కసబ్ అనే ఉగ్రవాది ని టార్గెట్ గా చేసుకుని ఈ సంఘటనని తెరపైన ఆవిష్కరించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రం మంచి విజయాన్ని అందించింది.
మేరీ కాం (2014)అయిదు సార్లు ప్రపంచ స్థాయి బాక్సింగ్ పోటీల్లో గెలిచిన ఒక మహిళా బాక్సర్ కధ ఆధారంగా తెరకెక్కిన సినిమా…ఈ సినిమాలో ఆ పాత్రను ప్రియాంక చోప్రా చేయగా….ఒముంగ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇక సంజయ్ లీలా బన్సాలి సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమా న్యాషనల్ అవార్డ్ ను సైతం దక్కించుకోవడం విశేషం.