ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కించిన ‘కె.జి.ఎఫ్'(సిరీస్) (KGF 2) .. మాస్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పింది. ‘హీరోయిజాన్ని ఇలా కూడా ఎలివేట్ చేయవచ్చు’ అని దర్శకులకి కొత్త లెసన్ చెప్పిన సినిమా. అందుకే ఇది ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. కానీ ఈ సినిమాని చాలా మంది ఫిలిం మేకర్స్ తప్పుగా అర్థం చేసుకున్నారేమో అనిపిస్తుంది. కాదు కాదు అలా అనిపించేలా కొన్ని సినిమాలు చేశాయి.
అర్థం పర్థం లేకుండా హీరోకి గ్రే షేడ్స్ తగిలించి జనాలని ఇబ్బంది పెట్టాయి. అలా కేజీఎఫ్ స్టైల్లో రూపొందిన సినిమాలు ఏంటి? వాటి ఫలితాలు ఏంటి? అనే విషయంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :
1) రణరంగం (Ranarangam) :
శర్వానంద్ (Sharwanand) హీరోగా సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా చాలా వరకు కేజీఎఫ్ స్ఫూర్తితో రూపొందిందే. హీరో ఒక గ్యాంగ్స్టర్. కూలీగా ప్రయాణం మొదలుపెట్టి గ్యాంగ్స్టర్ గా ఎదుగుతాడు. కానీ హై మూమెంట్స్ కూడా చాలా ల్యాగ్ ఉన్న ఫీలింగ్ కలిగిస్తాయి. అందువల్ల ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.
2) ‘పుష్ప'(ది రైజ్) (Pushpa ) :
‘కె.జి.ఎఫ్’ థీమ్ ని ‘రంగస్థలం’ స్టైల్లో తీస్తే అది ‘పుష్ప'(ది రైజ్) అనాలి. కేజీఎఫ్ లో బంగారు గనుల్లోకి హీరో వెళ్లి తర్వాత లీడర్ గా ఎదుగుతాడు. ‘పుష్ప’ లో కూడా సేమ్. సినిమా రిలీజ్ టైంలో కూడా దర్శకుడు బుచ్చిబాబు(Buchi Babu Sana).. ‘ ‘పుష్ప’ 10 కేజీఎఫ్..లతో సమానం’ అంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. కాకపోతే సినిమాలో సుకుమార్ (Sukumar) మార్క్ ఎమోషన్ వర్కౌట్ అయ్యింది. అందుకే ఇది గట్టెక్కేసింది. ‘పుష్ప 2′(Pushpa 2 The Rule) అయితే పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే.
3) ‘కురుప్’ :
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటించిన ఈ సినిమాలో కూడా.. హీరో క్యారెక్టర్ కేజీఎఫ్ స్ఫూర్తితో డిజైన్ చేసుకుందే అని చెప్పాలి. కాకపోతే ఇది నిజజీవితంలోని ఓ సంఘటనని ఆధారం చేసుకుని.. దాన్ని కేజీఎఫ్ స్టైల్లో చెప్పాలని చూశారు. ఈ సినిమా బాగానే ఆడింది.
4) ‘మైఖేల్’ (Michael) :
సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా రూపొందిన సినిమా ఇది. రంజిత్ జెయకోడి (Ranjit Jeyakodi) దర్శకుడు. 2023 ఆరంభంలో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ సినిమా కథ మాత్రమే కాదు, హీరో క్యారెక్టరైజేషన్ చాలా వరకు కే.జి.ఎఫ్ స్టైల్లోనే ఉంటుంది. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వంటి స్టార్ నటించినా ఈ సినిమాని ఆడియన్స్ పట్టించుకోలేదు.
5) ‘కబ్జా’ (Kabzaa) :
ఉపేంద్ర (Upendra Rao) , శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), కిచ్చ సుదీప్ (Sudeep Sanjeev) హీరోలుగా నటించిన ఈ క్రేజీ మూవీ కూడా ‘కె.జి.ఎఫ్’ స్టైల్లోనే ఉంటుంది. దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి చంద్రు (R. Chandru) దర్శకుడు. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.
6) ‘కింగ్ ఆఫ్ కొత్త’ :
మలయాళంలో రూపొందిన ‘కింగ్ ఆఫ్ కోత'( కింగ్ ఆఫ్ కొత్త(తెలుగులో)) సినిమా కథ, హీరో పాత్ర కూడా చాలా వరకు ‘కె.జి.ఎఫ్’ స్టైల్లోనే ఉంటాయి. అభిలాష్ జోషి డైరెక్ట్ చేసిన ఈ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది.
7) టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) :
స్టూవర్టుపురం దొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథని కూడా కేజీఎఫ్ స్టైల్లో తీశాడు దర్శకుడు వంశీ (Vamsee Krishna Naidu). అది ఆడియన్స్ కి రుచించలేదు. దీంతో సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.
8) ఈగల్ (Eagle) :
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) ఈ సినిమాని ‘కేజీఎఫ్’ స్ఫూర్తితోనే రూపొందించాడేమో అనిపిస్తుంది. ‘కె.జి.ఎఫ్’ స్టైల్లో వచ్చే డైలాగులు, మిగిలిన నటీనటులు హీరోకి ఇచ్చే బిల్డప్ అస్సలు సెట్ అవ్వవు. అందుకే ఆడియన్స్ ని ఆకట్టుకోలేక డిజాస్టర్ గా మిగిలిపోయింది ఈ సినిమా.
9) గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) :
‘కె.జి.ఎఫ్’ సినిమా ఇన్స్పిరేషన్ తో రూపొందిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరో. కృష్ణ చైతన్య (Krishna Chaitanya) దర్శకుడు. కె.జి.ఎఫ్ స్టైల్లో హీరో క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయాలని చూశారు, హీరోయిన్ చనిపోయే ట్రాక్ అన్నీ చాలా పేలవంగా ఉంటాయి. అందుకే సినిమా కూడా ప్లాప్ గా మిగిలిపోయింది.
10) హరోం హర (Harom Hara) :
సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకి జ్ఞాన సాగర్ ద్వారక (Gnanasagar Dwaraka) దర్శకుడు. ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ కె.జి.ఎఫ్ లో హీరో పాత్ర నుండి తీసుకున్నట్టే ఉంటుంది. కానీ ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ అవ్వలేదు. డిజాస్టర్ గా మిగిలిపోయింది.
11) మట్కా (Matka) :
వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన ఈ సినిమాకి కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకుడు. ఇందులో హీరో పాత్ర చాలా వరకు కె.జి.ఎఫ్ నుండి తీసుకున్నదే. వరుణ్ నటన తీసేస్తే ఇందులో ఆకట్టుకునే ఎలిమెంట్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదు. ఫలితంగా సినిమా డిజాస్టర్ లిస్టులోకి చేరిపోయింది.