తప్పక చూడాల్సిన…తలైవార్ సినిమాలు!!!

  • June 13, 2016 / 09:22 AM IST

రజని కాంత్…ఈ పేరు వింటే….భారత దేశంలోని అభిమానులే కాదు, ఇతర దేశాల్లో అభిమానులు కూడా అభిమానంతో ఉప్పొంగి పోతారు…మన దేశంలో కాకుండా, ఇతర దేశాల్లో సైతం అభిమానులున్న తొలి వ్యక్తిగా రజనికాంత్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక తలైవార్ సినిమా వస్తుంది అంటే ఆ సినిమా కోసం ప్రత్యేక సెలవు ప్రకటించిన రోజులు సైతం ఉన్నాయి అంటే….అతిశయోక్తి కాదు. అయితే అలాంటి తలైవార్ సినీ ప్రస్థానంలో తప్పక చూడావలసినవి, కొన్ని సినిమాలు ఉన్నాయి….వాటిల్లో కొన్నింటిని ఒక లుక్ వేద్దాం రండి…

అపూర్వ రాగంగల్తలైవార్ సినిమా ప్రస్థానంలో తొలి సినిమా…ఈ సినిమాలో రజనికాంత్ తో పాటు, కమల్ హసన్, శ్రీదేవి నటించారు….చనిపోయిన శ్రీదేవి భర్తగా, పాండియన్ అనే పాత్రలో మన రజని నటించాడు అనడం కన్నా…జీవించాడు అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా 1975లో విడుదల అయ్యింది

ముల్లుం మలారుంప్రముఖ రచయిత ఉమా చంద్రన్…రచించిన నవలా ఆధారంగా కొత్త దర్శకుడు మహేంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రజని ఒక ప్రవక్త పాత్రలో కనిపిస్తాడు. రజనితో పాటు…శరత్ బాబు, శోభ, జయలక్ష్మి లాంటి వాళ్ళు ఈ సినిమాలో కనిపించారు. కాళి పాత్రలో రజని కాంత్ నటన అమోఘం అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు బెస్ట్ మూవీగా ఫిల్మ్ ఫేర్ దక్కడమే కాకుండా, రజనికి సైతం ప్రత్యేక పురస్కారం దక్కింది. ఈ సినిమా 1978లో విడుదల అయ్యింది

నెట్రిక్కన్మొట్టమొదటి సారి మన తలైవార్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం. తండ్రి కొడుకుల పాత్రలో రజని యాక్టింగ్ అమోఘం. ఒక ఆడపిల్లని రేప్ చేసిన తండ్రి, అదే అమ్మాయి, అతని కొడుకుతో కలసి ఎలా బుద్ది చెప్పింది అనేదే కధ…ఏమయ్యింది, అసలు ఈ కధ ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసుకోవాలి అంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

అరిలిరుంతు అరుబతు వరైమధ్య తరగతి కుటుంభ కధ నేపధ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా సంతానం పాత్రలో భర్తని పోగొట్టుకున్న తల్లిని, తోడబుట్టిన వారిని ప్రయజాకుల్ని చేసేందుకు హీరో పదే తపన ఈ చిత్రం.

మూన్డ్రూ ముగం1982లో మొట్ట మొదటి సారిగా, రజనీకాంత్ మూడు పాత్రల్లో నటించిన చిత్రం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి, బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 250రోజులు ఆడింది. అంతేకాకుండా ఈ సినిమాకు రజనికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ దక్కింది.

జానీరజనికాంత్, శ్రీదేవి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పడానికి ప్రాణం పోసింది ఈ చిత్రం. ఈ సినిమాలో రెండు పాత్రల్లో మన తలైవార్ నటించాడు అనడం కన్నా, జీవించాడు అంటే అతిశయోక్తి కాదు.

ముత్తు90వ దశకంలో తమిళ సినిమా చరిత్రలో భారీ కలెక్షన్స్ ను కొల్ల గొట్టిన సినిమాగా నిలిచింది. దాదాపుగా 175 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడమే కాకుండా, 1998లో జపాన్ లో కూడా ఈ సినిమా విడుదల అవ్వడం విశేషం.

దళపతిమహాభారతం ఆధారంగా, కర్ణుడు, దుర్యోధనుడు మధ్య స్నేహ బంధాన్ని ప్రేక్షకులకు అందించిన సినిమా.

ఆన్నమలైదర్శకుడు సురేష్ కృష్ణ రచింది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజని ఒక సామాన్యుడిగా నటిస్తాడు. ఒక కోటీశ్వరుడు అయినటువంటి స్నేహితుడు కోసం అతని తండ్రితో వైరం పెంచుకునే పాత్రలో రజని విశ్వరూపం చూపించాడు.

బాషాఈ చిత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే…ఈ చిత్రం చాలా గొప్ప చిత్రం అని మనం చెప్పే మాటల కన్నా…ఈ చిత్రంలో రజనికి వచ్చిన పేరు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాధించిన కలెక్షన్స్, ఇంకా ఈ సినిమా సాధించిన రికార్డులు లెక్కలే ఎక్కువ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus