Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే
- June 18, 2026 / 02:31 PM ISTByPhani Kumar
తెలుగు సినిమాల్లో హాస్పిటల్ సీన్స్ అంటే.. హీరో లేదా హీరోయిన్ గాయపడి ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళడం.. ఆ తర్వాత కాసేపు టెన్షన్ పెట్టి.. ‘డాక్టర్ తో షి/హీ ఈజ్ సేఫ్’ అని చెప్పించడం. లేదు అంటే రెడ్ లైట్ వేసి ‘అదే డాక్టర్ తో సారీ’ అని చెప్పించడం.! ఎక్కువగా ఈ పాటర్న్ కనిపిస్తూ ఉంటుంది. కానీ మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టు హాస్పిటల్ సీన్స్ ను కూడా కొత్తగా డిజైన్ చేస్తూ వస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. గుండెల్ని పిండేసే ఎమోషన్స్ కి లేదంటే ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీన్స్ కి ‘హాస్పిటల్ బ్యాక్‌డ్రాప్’ ని ఓ ముఖ్య వేదికగా నిలబెడుతున్నారు. కొన్నాళ్ళుగా వచ్చిన సినిమాలను గమనిస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.ఇందులో భాగంగా.. గత కొనేళ్ళల్లో టాలీవుడ్లో(Tollywood) వచ్చిన సినిమాల్లో బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
Tollywood

1) గణేష్ : విక్టరీ వెంకటేష్ కెరీర్లో ఓ స్పెషల్ మూవీ ఇది. తిరుపతి స్వామి దర్శకుడు. కార్పొరేట్ హాస్పిటల్స్ లో జరిగే అక్రమాలని వేలెత్తి చూపుతూ రూపొందించిన సినిమా ఇది. ఆ రోజుల్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. క్లైమాక్స్ సీన్ అంతా హాస్పిటల్ నేపధ్యంలో ఉంటుంది. అక్కడ వెంకటేష్ నటన… ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తూ చెప్పే డైలాగులు ఆడియన్స్ తో క్లాప్స్ కొట్టిస్తాయి.

2)ఠాగూర్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళంలో మురుగదాస్ తెరకెక్కించిన ‘రమణ’ కి రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ హాస్పిటల్ సీన్ ఉంటుంది. అందులో ఓ డెడ్ బాడీతో హీరో ఆడే ట్రీట్మెంట్ గేమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. టాలీవుడ్ సినిమాల్లో రూపొందిన బెస్ట్ హాస్పిటల్ సీన్స్ లో ఇది టాప్ ప్లేస్లో నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

3)ఓ బేబీ : క్లైమాక్స్ లో మనవడు(తేజ సజ్జ) హాస్పిటల్ బెడ్ పై ప్రాణాపాయ స్థితిలో పడుంటే సమంత బ్లడ్ ఇవ్వడానికి వెళ్తూ కొడుకు(రావు రమేష్) స్నేహితుడుతో(రాజేంద్రప్రసాద్) వద్ద పలికే ఎమోషనల్ డైలాగులు హృద్యంగా ఉంటాయి. ఈ సినిమా స్థాయిని పెంచడంలో ఈ సన్నివేశం పాత్ర చాలా ఉంది అనే చెప్పాలి.

4)అల వైకుంఠపురములో : త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందిన సూపర్ హిట్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇంటర్వెల్ సీక్వెన్స్ హాస్పిటల్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది. అక్కడ అల్లు అర్జున్ కి తన అసలు ఫ్యామిలీ గురించి రివీల్ అయ్యే ఎపిసోడ్.. దానిని క్లైమాక్స్ తో కనెక్ట్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఎమోషనల్ గా కూడా ట్రావెల్ అయ్యేలా చేస్తుంది.

5)హాయ్ నాన్న : సినిమా క్లయిమాక్స్ లో హీరో(నాని) కూతురికి విలన్ గ్యాంగ్ అంతా వచ్చి సర్జరీ చేసి బ్రతికించే సీన్.. బయట హీరో హీరోయిన్ తో హీరో పలికే డైలాగులు చాలా హృద్యంగా అనిపిస్తాయి. మానవత్వాన్ని తట్టిలేపేలా ఈ హాస్పిటల్ సీన్ ను తెరకెక్కించాడు దర్శకుడు.

6) గుంటూరు కారం : యాక్సిడెంట్ పాలైన తల్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు పరిగెత్తుకుని వచ్చే హీరో.. అనంతరం ఆ హాస్పిటల్ వాతావరణంలోనే తల్లి ప్రెస్ మీట్ పెట్టడం.. ఈ క్రమంలో పలికే డైలాగులు చాలా బాగుంటాయి.కొడుక్కి అంటే హీరోకి అందరి ముందు తల్లి ప్రేమను వివరించే సన్నివేశం దానికి తమన్ వాయించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది.

7)లక్కీ భాస్కర్ : ధనాపేక్షతో నైతిక విలువలు మర్చిపోయిన హీరో… ఓ వ్యక్తి కోసం హాస్పిటల్ కి రావడం. అక్కడ హీరో తన తప్పుల్ని గుర్తుచేసుకుంటూ పశ్చాత్తాపపడుతూ… సూరజ్(శ్రీనాథ్ మాగంటి) పాత్రతో గొడవ పెట్టుకునే సన్నివేశం చాలా ఎమోషనల్ గా ఉంటుంది.

8)ఓజి : ‘ఓజి’ ని వెతుక్కుంటూ సత్య దాదా(ప్రకాష్ రాజ్) కన్మణి(ప్రియా ప్రకాష్ వారియర్) హాస్పిటల్ కి రావడం.. అక్కడ ఓజి కూతురితో సత్య దాదా పలికే డైలాగులు చాలా ఎమోషనల్ ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. ఆ తర్వాత వచ్చే ఫైట్ సీక్వెన్స్.. దానిని మళ్ళీ క్లైమాక్స్ కి కనెక్ట్ చేసిన తీరు చాలా బాగుటుంది.

9) ది రాజాసాబ్ : తాత ప్రేతాత్మగా గారి నాయనమ్మని వేధించడం… ఇందులో భాగంగా ఆమె హాస్పిటల్ పాలయ్యేలా చేయడం..ఆ తర్వాత హీరో హాస్పిటల్ కి వచ్చి నాయనమ్మని బ్రతికించుకోవడానికి పడే తాపత్రయం అంతా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ప్రభాస్ కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలంటే.. ఈ హాస్పిటల్ సీన్ గురించి కూడా చెప్పుకోవాలి.

10) పెద్ది : రీసెంట్ గా వచ్చిన ‘పెద్ది’ సినిమాలో కూడా ఓ హాస్పిటల్ సీన్ ఉంటుంది. అక్కడ చరణ్ పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందరితో కన్నీళ్లు పెట్టిస్తుంది. ‘ఈ ఒక్క సీన్ చాలు అతనికి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టడానికి’ అనే విధంగా ఆ సీన్ ను తెరకెక్కించాడు దర్శకుడు బుచ్చిబాబు.















