సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రమే కాదు.. రిలీజ్ కి ముందు.. థియేటర్ నుంచి తీసేసినప్పుడు కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ రూపంలో ప్రీ రిలీజ్ సమయంలో హంగామా చేస్తుంటే.. తాజాగా బుల్లి తెరపై రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటివరకు తెలుగు సినిమాలు టీవీలో ప్రసరమైనప్పుడు అత్యధికంగా రేటింగ్ సాధించిన సినిమాల జాబితాను బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC) తాజాగా బయటపెట్టింది. బాహుబలి బిగినింగ్, బాహుబలి కంక్లూజన్, దువ్వాడ జగన్నాథం తొలి మూడు స్థానాలను కైవశం చేసుకున్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1 టెలివిజన్ ప్రీమియర్ షోకి 23 టీఆర్పీ నమోదు కాగా, బాహుబలి 2 కి 22.7 గాటీఆర్పీ వచ్చి రికార్డు సృష్టించాయి. బుల్లి తెరలో తొలి రెండు సినిమాలు ప్రభాస్ వి కావడంతో అభిమానులు ఆనందిస్తున్నారు. ఇక ఎవరూ ఊహించనట్టుగా అల్లుఅర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం మూవీ టెలివిజన్ ప్రీమియర్ షోకి 21.70 టీఆర్పీ నమోదయింది. దీంతో మూడో స్థానం బన్నీ సొంతమైంది. కుటుంబసమేతంగా ఈ చిత్రాలను చూసేందుకు తెలుసు ప్రజలు ఆసక్తి కనబరిచినట్లు అర్ధమయింది.