బిగ్ బాస్ 4: ఒక్కొక్కరిలో ఒక్కో క్వాలిటీ..!

బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొక్కరి జెర్నీ ముగిసింది. రెండురోజుల తర్వాత గ్రాండ్ ఫినాలేకి అంతా సిద్ధమైపోతున్నారు. ఈ టైమ్ లో అందరి జెర్నీలని చూపించాడు బిగ్ బాస్. ఈసారి పార్టిసిపెంట్స్ ఆడియన్స్ కి అస్సలు ఫేమస్ సెలబ్రిటీలు కాకపోయినా, సోషల్ మీడియాలో తప్ప ఎవ్వరికీ పెద్దగా తెలియకపోయినా కూడా ఈ సీజన్ బాధ్యతలని పార్టిసిపెంట్స్ వాళ్లు భుజాలపైన వేసుకుని మరీ నడిపించారు. వందరోజులు జెర్నీలో ఒక్కొక్కరిదీ ఒక్కో మార్క్ జెర్నీ అయ్యింది. ఇందులో మనం హైలెట్స్ ని ఒక్కసారి చూసినట్లయితే..,

అభిజిత్ సీజన్ లో చేసి రోబో టైస్క్ హైలెట్ అనే చెప్పాలి. అంతేకాదు, తన బిహేవియర్ కానీ, తను మాట్లాడే పద్దతి కానీ హౌస్ మేట్స్ ని బాగా ఆకర్షించింది. టాస్క్ లో తను ఎంతవరకూ పెర్ఫామ్ చేయగలడో అంతవరకూ చేశాడు. ఇక ఓటింగ్ లో అయితే ప్రభంజనమే సృష్టిస్తున్నాడు. ఈసారి టైటిల్ ఎగరేసుకుపోవడానికి సిద్దంగానే ఉన్నాడని చెప్పొచ్చు.

అలాగే అఖిల్ అంతకుముందు అస్సలు ఎవ్వరికీ తెలియక పోయినా సరే, బిగ్ బాస్ హౌస్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని వేసుకుని టాప్ – 5లోకి వచ్చాడు. మోనాల్ లో లవ్ ట్రాక్, సోహైల్ తో ఫ్రెండ్షిప్ ట్రాక్ లతో ఆకట్టుకున్నాడు. టాస్క్ లలో ఫోకస్ గా ఉంటూనే తన గేమ్ బలం ఏంటో అందరికీ చూపించాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేసుకున్నాడు.

సోహైల్ విషయానికి వస్తే తను బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్షిప్ ని చూపించాడు. అలాగే చాలాసార్లు టాస్క్ లని ఫ్రెండ్స్ కోసం త్యాగం చేశాడు. నామినేషన్స్ లో ఆవేశం, అరవడం, అరియానాతో ఫైటింగ్, ఇవన్నీ కూడా హైలెట్ అయ్యాయి. ఇంట్లో కుటుంబసభ్యుడిలాగా కలిసిపోయాడు. అంతకుముందు సోహైల్ కి రాని గుర్తింపు ఇప్పుడు బిగ్ బాస్ వల్ల వచ్చిందంటే అతి అతిశయోక్తి ఏమాత్రం కాదు.

దేత్తడి హారిక సోషల్ మీడియాలో చాలా ఫేమస్. సపరేట్ ఫాలోవర్స్ కూడా ఉంటారు. అలాంటిది బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత ఇది రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. హారిక గేమ్ ఎలా ఆడుతోంది అంటూ ఫాలో అయినవాళ్లే చాలామంది ఉన్నారు. అంతేకాదు, చిన్నపిల్లలా అల్లరి చేస్తూ, టాస్క్ లు వచ్చినపుడు ఇచ్చిపారేస్తూ తనదైన మార్క్ ని సీజన్ 4 లో వేసింది. టాప్ – 5లోకి దూసుకు వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందరి ఇంట్లో పిల్లలాగా కలిసిపోతూ ఈ సీజన్ లో హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి.

అరియానా గ్లోరీ కి సోషల్ మీడియాలో పెద్ద ఫాలోయింగ్ లేకపోయినా కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత సపరేట్ ఫ్యాన్స్ ని ఏర్పరుచుకుంది. టాస్క్ లలో తనదైన స్టైల్లో ప్రశ్నించడం, గేమ్ ఆడేందుకే ఎక్కువశాతం ఆసక్తిని చూపించడం, ఎక్కడా తగ్గకుండా టాస్క్ లు ఆడటం అనేది టాప్ 5 వరకూ అరియానాని తీసుకుని వచ్చింది. అంతేకాదు, సోషల్ మీడియాలో ఇప్పుడు తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 4లో గేమ్ ని ఇలా కూడా ఆడచ్చు అంటూ తనకంటూ ఒక బెంచ్ మార్క్ ని కూడా క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అందుకే ఈ ఐదుగురు జెర్నీలు చూసేటపుడు ఈ ఐదుగురు కూడా టైటిల్ కి అర్హులే అని ఆడియన్స్ కి అనిపించింది. ఓటింగ్ పరంగా ఎవ్వరు టైటిల్ తీస్కున్నా సరే, ఈ ఐదుగురు మాత్రం బిగ్ బాస్ సీజన్ 4 కి హైలెట్ అనే చెప్పాలి.

[yop_poll id=”1″]

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus