మంగ్లీ స్టార్ సింగర్ అవ్వడానికి ఈ పాటలే కారణమట..!

  • March 11, 2021 / 01:41 PM IST

ఇప్పుడు ఎక్కడ విన్నా సారంగదరియా పాటే. మీరు ఏదైనా టీ స్టాల్ కు వెళ్లినా లేక.. యూట్యూబ్ చూసినా.. ఎవరి కాలర్ ట్యూన్ విన్నా.. ఇదే పాట మారుమోగుతోంది.నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘లవ్ స్టోరీ’ చిత్రం నుండీ ఈ ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఆ తరువాత లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేశారు. దానికి యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ నమోదవుతున్నాయి. ప్రోమోలో సాయి పల్లవి తన ఎనర్జిటిక్ డ్యాన్స్ తో మరోసారి ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే ఈ పాట ఇంత ఎనర్జిటిక్ గా ఉండడానికి ముఖ్య కారణం సింగర్ మంగ్లీ అనే చెప్పాలి. ఆమె పాడటం వలెనే ఈ పాట ఇంత బాగా వచ్చింది అని చాలా మంది ప్రేక్షకులు చెబుతున్నారు. అయితే ఈ పాట కొన్ని వివాదాలకు కూడా తెరలేపింది అనుకోండి. దాంతో ఈ పాట మరింత వైరల్ అయ్యిందనే చెప్పాలి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. సింగర్ మంగ్లీ గురించి ఆమె పాడిన కొన్ని హిట్ సాంగ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం రండి.

మంగ్లీ అసలు పేరు సత్యవతి రాతోడ్. ఈమె ఆంధ్ర ప్రదేశ్ లోని… అనంతపురం జిల్లాలో జన్మించింది. ఈమె వయసు 26 సంవత్సరాలు. మంగ్లీ పాపులర్ సింగర్ అవ్వడానికి ఆమె తండ్రి ప్రోత్సాహం ఎంతో ఉంది. కెరీర్ ప్రారంభంలో పలు టీవీ ఛానెల్స్ లో యాంకర్ గా పనిచేస్తూనే ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది. ఆ తరువాత శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘నీది నాది ఒకే కథ’ సినిమా ద్వారా సినిమాల్లో కూడా పడటం మొదలుపెట్టింది. ఇక ఈమె పాడిన వాటిలో హిట్ సాంగ్స్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1)రేలా రే రేలా : ‘తెలంగాణ ఫార్మేషన్ డే’ సాంగ్ అయిన ‘రేలా రే రేలా’ ను మంగ్లీ చాలా బాగా పాడింది. ఈ పాట మంచి హిట్ అవ్వడంతో మంగ్లీకి మంచి పేరొచ్చింది.

2)బులెట్ – జార్జ్ రెడ్డి : ‘ఆడు నడిపే బండి రాయలు ఎన్ఫీల్డు’ ఈ పాట ఎంత చార్ట్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదుగా.

3)బతుకమ్మ : మంగ్లీ పాడిన బతుకమ్మ పాట కూడా పెద్ద హిట్ అయ్యింది.

4)రాములో రాములా : ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ఈ పాట ఇప్పటికీ ప్రేక్షకుల నోట్లో నానుతూనే ఉంది.

5)భూమ్ బద్దలు : ‘క్రాక్’ సినిమాలోని ఈ మాస్ పాట కూడా అందరితోనూ స్టెప్పులు వేయించింది.

6)శివరాత్రి పాట : డివోషనల్ సాంగ్స్ కు కూడా కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన మంగ్లీ పాడిన మరో హిట్ సాంగ్ ఇది.

7)సారంగదరియా : ప్రస్తుతం ఓ ఊపు ఒప్పేస్తున్న ఈ పాట గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా..!

8)ఆడ నెమలి : ఈ సాంగ్ కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది.

9)శైలజారెడ్డి అల్లుడు : ఈ చిత్రంలో టైటిల్ సాంగ్ ను చాలా చక్కగా పాడింది మంగ్లీ.

10)సంక్రాంతి పాట : మొన్న సంక్రాంతికి ఎక్కడ విన్నా ఇదే పాట.

11)పైన పటారం : త్వరలో రాబోతున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రంలోని ఈ పాట కూడా సూపర్ హిట్ అయ్యింది.

12) రామసక్కనోడివిరో : ‘క్వశ్చన్ మార్క్’ ఈ సినిమా ఎప్పుడొచ్చిందో ఎవ్వరికీ తెలీదు కానీ ఈ పాట మాత్రం సూపర్ హిట్.

13)రంభ ఊర్వశి మేనక : ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలోని ఈ మాస్ సాంగ్ కూడా ప్రేక్షకులతో స్టెప్పులు వేయించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus