ఖరారు అయిన రవితేజ కొత్త చిత్రం ట్రైలర్, రిలీజ్ తేదీలు!

రెండేళ్ల తర్వాత మాస్ మహారాజ రవితేజ డబల్ జోష్ తో “రాజా ది గ్రేట్” అంటూ వచ్చారు. ఈ చిత్రాన్ని అభిమానులు హిట్ చేయడంతో ఇదివరకటి ఉత్సాహంతో చకచకా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రవి తేజ  నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో “టచ్ చేసి చూడు” సినిమా షూటింగ్ ని వేగంగా కంప్లీట్ చేశారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వచ్చిన  “టచ్ చేసి చూడు”  టీజర్ లో రవితేజ అదరగొట్టారు.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరోసారి దుమ్ము రేపనున్నట్లు శాంపిల్ చూపించారు. టెంపర్.. కిక్.. రేసుగుర్రం తదితర సినిమాలకు కథ అందించిన వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ అందించడంతో దీనిపై రవితేజ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఆ డేట్ ని చిత్ర బృందం నేడు అధికారికంగా ప్రకటించింది. సినిమా వచ్చే నెల 2వ తేదీన థియేటర్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అలాగే ఈ మూవీ ట్రైలర్ ఈనెల 26 న విడుదల అవుతుందని స్పష్టంచేసింది. ప్రీతమ్ స్వరపరిచిన పాటలు ఒక్కొక్కటిగా నెట్లో రిలీజ్ అవుతున్నాయి. ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరుగుతుందా ? లేదా? అనేది రెండు రోజుల్లో వెల్లడించనున్నారు. ఈ మూవీ తర్వాత రవితేజ రెస్ట్ తీసుకోకుండా సోగ్గాడే చిన్ని నాయన డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమాని మొదలెట్టారు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus