ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా పుష్ప ది రూల్ (Pushpa 2) మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ లో మార్పు లేదని మేకర్స్ ఇప్పటికే వేర్వేరు సందర్భాల్లో వెల్లడించడం జరిగింది. పుష్ప ది రూల్ సినిమాకు పోటీగా మరో సినిమాను రిలీజ్ చేయడానికి ఇతర తెలుగు సినిమాల మేకర్స్ అస్సలు ఆసక్తి చూపడం లేదు. అయితే ఇతర భాషల నుంచి మాత్రం పుష్ప ది రూల్ సినిమాకు గట్టి పోటీ ఎదురవుతుండటం గమనార్హం.
ఈ సినిమాకు పోటీగా తమిళంలో విజయ్ (Vijay) హీరోగా తెరకెక్కుతున్న గోట్ రిలీజ్ కానుండగా హిందీలో (Ajay Devgn) అజయ్ దేవగన్ సింగం అగైన్ కూడా రిలీజ్ కానుంది. మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే పుష్ప ది రూల్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో కొంతమేర నష్టపోవాల్సి ఉంటుంది. పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి త్వరలో ప్రమోషన్స్ మొదలుకానున్నాయని సమాచారం అందుతోంది.
బిజినెస్ పరంగా కూడా సంచలనాలు సృష్టిస్తున్న పుష్ప ది రూల్ కలెక్షన్ల పరంగా కూడా సంచలనాలు సృష్టించడం ఖాయమని బన్నీ (Allu Arjun) అభిమానులు ఫీలవుతున్నారు. ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ చేస్తే సినిమాకు కలెక్షన్ల పరంగా కలిసొస్తుందని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండనుందని తెలుస్తోంది.
పుష్ప ది రూల్ సినిమా బన్నీ కెరీర్ కు ఎంతో కీలకం కాగా ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా మూడేళ్ల సమయం కేటాయించారు. ఈ సినిమాతో కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందని బన్నీ నమ్మకంతో ఉన్నారు. పుష్ప ది రూల్ సినిమాకు పోటీగా రిలీజ్ చేస్తే ఆ సినిమాలకే భారీ నష్టమని బన్నీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పుష్ప ది రూల్ సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉండనున్నాయని తెలుస్తోంది.
ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!
ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?