Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సత్య రాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ (Hero)
  • సాంచి రాయ్, ఉదయ భాను (Heroine)
  • వీ టీవీ గణేష్,క్రాంతి కిరణ్ (Cast)
  • మోహన్ శ్రీవత్స (Director)
  • విజయ్ పాల్ రెడ్డి అడిదల (Producer)
  • ఇన్ఫ్యూజన్ బ్యాండ్ (Music)
  • కుశేందర్ రమేష్ రెడ్డి (Cinematography)
  • ఎస్ బి ఉద్ధవ్ (Editor)
  • Release Date : ఆగస్టు 29, 2025
  • వానర సెల్యూలాయిడ్ (Banner)

తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’.సీనియర్ యాంకర్ ఉదయభాను కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. టీజర్, ట్రైలర్ వంటివి ఇంప్రెసివ్ గానే అనిపించాయి. మరి సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :

Tribanadhari Barbarik Review

కథ: కొడుకు కోడల్ని పోగొట్టుకుని మనవరాలు నిధి(మేఘన) సర్వస్వంగా జీవిస్తుంటాడు సైకాలజిస్ట్ శ్యామ్ కతు (సత్య రాజ్). అందరి మైండ్ సెట్, లోపాలు, వాటికి పరిష్కారాలు తెలిసినప్పటికీ.. మనవరాలు టైంకి కనబడకపోతే విలవిలలాడిపోతుంటాడు. అయితే ఒకరోజు తన మనవరాలు ఊహించని విధంగా మిస్ అవుతుంది. మరో వైపు రామ్ (వశిష్ట ఎన్ సింహా) విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలని ఆశపడతాడు. అందుకు 30 లక్షలు అవసరం పడుతుంది. దానికోసం అతను క్యాబ్ డ్రైవర్ గా చేస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి సత్య (సాంచీ రాయ్) పరిచయం అవుతుంది. మరోపక్క రామ్ స్నేహితుడు దేవ్(క్రాంతి కిరణ్) డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుంటాడు. వీరికి శ్యామ్ మనవరాలి మిస్సింగ్ కి సంబంధం ఏంటి? మరోపక్క పాల వ్యాపారం చేసుకునే లేడీ డాన్ వాకిలి పద్మ (ఉదయభాను) దేవ్ కి ఏమవుతుంది.? చివరికి శ్యామ్ మనవరాలు తిరిగి అతన్ని చేరుకుందా? అందుకు అతను చేసిన ప్రయత్నాలు ఏంటి? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: సైక్రియార్టిస్ట్ ఆల్మోస్ట్ టైటిల్ రోల్ పోషించారు. ఎప్పటిలానే తన మార్క్ నటనతో పాత్రకు నిండుతనం తీసుకొచ్చారు. డబ్బింగ్ విషయంలో కొత్తగా ట్రై చేశారు. వశిష్ట పోషించిన విలక్షణ పాత్ర మెప్పిస్తుంది. సత్యం రాజేష్ కూడా చాలా బాగా చేశాడు. వీ టీవీ గణేష్ కామెడీ రోల్ కాకుండా ముఖ్య పాత్ర పోషించడం విశేషం.చాలా రోజుల తర్వాత ఉదయభానుకి మంచి పాత్ర దొరికింది.ఆమె లుక్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. సాంచీ రాయ్, మేఘన, కార్తికేయ మొట్ట రాజేంద్రన్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు మరియు భీముని మనవడు బార్బరికుడు అని ఎక్కువ మందికి తెలియదు.ఇతను వాడే మూడు బాణాలకి కురుక్షేత్ర యుద్ధం యొక్క గమనాన్ని మార్చగల సమర్థత ఉందని కూడా చెబుతుంటారు. అలాంటి ఒక పాత్రను తీసుకుని ఈ ‘త్రిబాణధారి బార్బరిక్’ కథని డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు మోహన్ శ్రీవత్స. తన మనవరాలు మిస్ అవ్వడానికి, ఆమెను వేధించిన వారిని బార్బరిక్ గా మారి వారికి ఎలా బుద్ధి చెప్పాడు అనేది మెయిన్ థీమ్. అయితే నేటి తరం యువత ఆలోచనా విధానం, అలవాట్ల వల్ల ఆడపిల్లలకు ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి అనే సెన్సిటివ్ టాపిక్ ను కూడా దర్శకుడు టచ్ చేశారు.

అయితే కథనం చాలా వరకు కన్ఫ్యూజ్ చేస్తూ సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో ముందుకు, వెనక్కి వెళ్లే విధానం కామన్ ఆడియన్స్ కి రుచించదు. సెకండాఫ్ ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు కూడా ఆసక్తిగా సాగవు. కానీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్..లు, ఇచ్చిన మెసేజ్ కన్విన్సింగ్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కొంచెం వీక్ గానే ఉన్నా టెక్నికల్ టీం వాటిని కవర్ చేసే ప్రయత్నం చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు ఓకే. నిడివి 2 గంటల 8 నిమిషాలే ఉండటం మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి.

విశ్లేషణ: చివరిగా ‘త్రిబాణధారి బార్బరిక్’ మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ గ్రిప్పింగ్ నెరేషన్ లేకపోవడం వల్ల ఓ సాదా సీదా సినిమాగా మిగిలిపోతుంది. థియేటర్లలో నిలబడుతుందో లేదో చెప్పలేం కానీ ఇలాంటి సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు ఉన్నాయి.

రేటింగ్ : 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus