Trinadha Rao Nakkina: సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు మళ్లీ యంగ్ హీరోతోనే!

దర్శకుడిగా త్రినాథరావు నక్కినది (Trinadha Rao Nakkina ) ఒక రేర్ రికార్డ్. వరుస హిట్స్, రవితేజకి (Ravi Teja)  మొదటి 100 కోట్ల సినిమా ఇచ్చిన ఘనుడు, అలాగే అరడజను హిట్స్ ఉన్న అతికొద్ది మంది దర్శకుల్లో ఒకడు. అయినా కూడా ఎందుకో త్రినాథరావుకి స్టార్ హీరోల డేట్స్ మాత్రం దొరకడం లేదు. ఇటీవల వచ్చిన “మజాకా” (Mazaka)  తోనూ  డీసెంట్ హిట్ అందుకున్న త్రినాథరావు తదుపరి సినిమా ఎవరితో అనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. నిజానికి త్రినాథరావు ఈసారి కచ్చితంగా ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తాడు అనుకున్నారు ఇండస్ట్రీ జనాలు.

Trinadha Rao Nakkina

కట్ చేస్తే.. త్రినాథరావు చేయబోయే తదుపరి సినిమా హవీష్ తో (Havish) అని తెలిసింది. ఎప్పుడో 2011లో రవిబాబు తెరకెక్కించిన “నువ్విలా”తో (Nuvvila) హీరోగా తెరంగేట్రం చేసిన హవీష్ కి హీరోగా సరైన గుర్తింపు రాలేదు. అయితే నిర్మాతగా మాత్రం “రాక్షసుడు” (Rakshasudu) చిత్రంతో హిట్ కొట్టాడు. 2019లో వచ్చిన “సెవెన్” హవీష్ హీరోగా నటించిన చివరి సినిమా, ఆ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. త్రినాథరావు నక్కిన-హవీష్ ల సినిమా ఎనౌన్స్ మెంట్ త్వరలోనే ఉంటుందని వినికిడి.

అయితే.. ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్మెంట్ ఇప్పుడు చేస్తున్నప్పటికీ, డిస్కషన్ మాత్రం చాన్నాళ్ల క్రితమే అయ్యాయని, ఇప్పటికి సెట్స్ మీదకు వెళుతుందని తెలుస్తోంది. మరి ఈ రీఎంట్రీతోనైనా హవీష్ నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంటాడో లేదో చూడాలి. ఇకపోతే.. ఈ చిత్రానికి కూడా త్రినాథరావు నక్కిన-ప్రసన్న కుమార్ లా క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. మరి ఈ సినిమాతో త్రినాథరావు నక్కిన తన డబుల్ హ్యాట్రిక్ ను కంప్లీట్ చేయగలుగుతాడా లేదా అనేది చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus