కొత్త హెయిర్ కట్ తో కత్తిలా ఉన్న త్రిష!

వైన్స్ వేల్యూ ఓల్డ్ అయ్యే కొద్దీ పెరుగుతుందంటారు. ఇప్పుడు కొందరు హీరోయిన్ల పరిస్థితి కూడా అలానే తయారయ్యింది. త్రిష, నయనతార, కాజల్ లాంటి హీరోయిన్స్ కి వయసు, సీనియారిటీ పెరిగే కొద్దీ పాపులారిటీతోపాటు క్రేజ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఆల్రెడీ నయనతార, కాజల్ లు యువ హీరోలు, సీనియర్ హీరోలు అన్న తేడా చూడకుండా వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీయస్ట్ హీరోయిన్లుగా మారిపోయారు. ఇప్పుడు వీళ్ళ జాబితాలో త్రిష కూడా జాయినవుతోంది. ఇటీవలకాలంలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా చేస్తున్న త్రిష రీసెంట్ గా రజనీకాంత్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది.

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ తాజా చిత్రంలో రజనీకాంత్ లెక్చరర్ గా నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష కూడా మరో లెక్చరర్ గా నటించనుందని తెలుస్తోంది. అందుకు సాక్ష్యం ఆమె సరికొత్త హెయిర్ కట్. మంచి మోడ్రన్ లెక్చరర్ లుక్ లో భలే క్లాసీగా ఉన్న త్రిష కొత్త లుక్ ప్రస్తుతం వైరల్ అయ్యింది. హీరోయిన్ గా కెరీర్ మొదలెట్టి 12 ఏళ్ళు పూర్తవుతున్నా ఇప్పటికీ వన్నె తగ్గని అందంతో ఆకట్టుకొంటున్న త్రిషను చూస్తుంటే మరో అయిదేళ్లవరకూ ఆమెకు అడ్డు లేదని స్పష్టమవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus