త్రిష పెళ్లి కూతురు కాబోతుందా ?

చెన్నై సుందరి త్రిష తెలుగులోని యువ హీరోలు, సీనియర్ హీరోలందరితో నటించి మంచి విజయాలను అందుకుంది. తమిళంలోనూ అనేక హిట్ చిత్రాల్లో నటించి.. దక్షణాది టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ఈనెల 4 వ తేదీన 35  వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ ఇదివరకే పెళ్లి పీటలు ఎక్కాల్సింది. 2015 లో  త్రిష వరుణ్ నిశ్చితార్థం చేసుకుంది. కానీ వారిద్దరూ పెళ్లిపీటలు దాకా వెళ్లలేకపోయారు.  త్రిష నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకొని సినిమాల్లో బిజీ అయింది. గ్లామర్ రోల్స్ తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్తో పూర్వవైభవాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు కూడా ఆమె చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. మూడూ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. మరో మూడు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అయితే కొత్త చిత్రాలకు మాత్రం సైన్ చేయడం లేదు. కారణం పెళ్లి అని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. అందుకోసం తెగ షాపింగ్ చేస్తోందంట. ఆమె షాపింగ్ చూస్తుంటే కచ్చితంగా అది వెడ్డింగ్ షాపింగే అని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ మధ్య చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో తరచూ పార్టీలకు వెళుతోందని, అతనితోనే జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమవుతోందని వెల్లడించాయి. ఈ సారి పెళ్ళికి ఏ ఆటంకం కలగకుండా ఉండాలని నిశ్చితార్థం లేకుండా నేరుగా పెళ్లి చేసుకుంటారని పేర్కొన్నాయి. ఆగస్టులో త్రిష పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసిందని ఆమె సన్నిహితులు తెలిపారు. మరి రహస్యంగా పెళ్లి చేసుకుంటుందా? లేకుంటే మీడియాకి చెప్పి చేసుకుంటుందా? అనేది చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus