ఆ తమిళ హీరోనే త్రిష పెళ్లాడితే త్రిష ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూసే

అప్పుడెప్పుడో 2015లో త్రిష ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకొని అప్పటి నుంచి బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. సినిమాలు కూడా ఇదివరకటిలా కాక సెలక్టివ్ గా చేస్తోంది. క్యారెక్టర్ నచ్చకపోతే ఎంత పెద్ద ఆఫర్ అయినా రిజెక్ట్ చేస్తుంది. “96” సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన త్రిష “ఆచార్య” సినిమాను రిజెక్ట్ చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ త్రిష మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయితే.. ఈ వార్త త్రిష ఫ్యాన్స్ కు ఏమాత్రం నచ్చడంలేదు.

ఇంతకీ ఆ మేటర్ ఏంటంటే.. త్రిష త్వరలోనే శింబును పెళ్లాడనుందనే వార్త కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వీళ్ళిద్దరూ కలిసి ఇటీవలే ఒక షార్ట్ ఫిలిమ్ లోనూ నటించారు. “ఏమాయ చేసావె” తమిళ వెర్షన్ లో కలిసి నటించినప్పట్నుంచి త్రిష-శింబుల విషయంలో ఎఫైర్ అనే వార్త హల్ చల్ చేస్తూనే ఉంది. నయనతారతో బ్రేకప్ అనంతరం శింబు కూడా ఎవరితోనూ డీసెంట్ రిలేషన్ షిప్ మైంటైన్ చేయలేదు. దాంతో ఇప్పుడు శింబు-త్రిష పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త ఎక్కడలేని ప్రాధాన్యతను సంతరించుకోంటోంది.

మరి ఈ విషయంలో త్రిష-శింబు ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యేవరకూ ఇలా గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. ఒకవేళ త్రిష-శింబు గనుక నిజంగానే పెళ్లాడితే మాత్రం మోస్ట్ కాంట్రవర్సీయల్ పెయిర్ గా సినిమా చరిత్రలో నిలిచిపోతారు.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus