త్రివిక్రమ్ ముందు చూపు బానే ఉంది.. వర్కౌట్ అవుతుందా…?

ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రానికి ‘అయినను పోయిరావాలె హస్తినకు’ అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నారు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలవ్వాలి అంటే ఎన్టీఆర్ ముందుగా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని పూర్తి చెయ్యాలి.

కానీ లాక్ డౌన్ వల్ల ఆ చిత్రం షూటింగ్ చాలా వరకూ పెండింగ్ లో ఉంది. ఆ షూటింగ్ పూర్తయ్యే వరకూ ఎన్టీఆర్ లుక్ మార్చడానికి వీలవ్వదు. దీంతో ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మరో చిన్న సినిమా చేద్దాం అని ప్లాన్ చేస్తున్నాడట. ‘అ ఆ’ ల మంచి ప్రేమకథ చేస్తే బాగుంటుంది అని త్రివిక్రమ్ భావిస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఓ స్క్రిప్ట్ రాసుకున్నాడట. దీనిని ఓ మీడియం రేంజ్ హీరోతో తీస్తే బాగుంటుంది అని భావిస్తున్నాడట.

‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారే ఈ ప్రాజెక్ట్ ను నిర్మించే అవకాశం ఉందని తెలుస్తుంది. వారి దృష్టిలో నాని, నాగ చైతన్య వంటి వారు ఉన్నారట. ఇప్పటికే నితిన్ తో రెండు సినిమాలు చేసారు.. ఇప్పుడు మూడో సినిమా కూడా చేస్తున్నారు. కాబట్టి నాని మరియు నాగ చైతన్య ల కాల్ షీట్లు ఉన్నాయి కాబట్టి… వీరిద్దరిలో ఒకరు ఈ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం ఉందని టాక్.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
సమంత బర్త్ డే స్పెషల్ : రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus