అజ్ఞాతవాసి సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్న “అరవింద సమేత వీర రాఘవ” సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీని మాస్ ప్రేక్షకులకు విందు భోజనంలా ఉండాలని చిత్రీకరిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథ కోసం రాయలసీమలోని ఒక గ్రామాన్నే రామోజీ ఫిలిం సిటీలో వేయించారు. తాజాగా కథలో ఒక ముఖ్యమైన సన్నివేశంలో ఒక చెట్టు అవసరమైందంటా. ఆ చెట్టు కోసం ఎంత గాలించినా కుదరకపోవడంతో చెన్నై నుంచి ప్లాస్టిక్ ఆకులను తెప్పించి కృత్రిమంగా చెట్టుని ఆర్ట్ డైరెక్టర్ తో వేయించాడట. ఆ చెట్టు సినిమాలో కొన్ని నిముషాలు మాత్రమే కనిపించినప్పటికీ ఖర్చు అదిరిపోతోంది.
చెట్టుకోసం చెన్నై నుంచి తెప్పించిన ఆ ఆకుల ఖరీదు పాతిక లక్షలని తెలిసింది. ఆకులు నిండిన చెట్లతో పాటు వాడిపోయిన చెట్లను కూడా లొకేషన్ లో సెట్ చేశారట. కాకపోతే గాలి వానకు ఓసారి అన్ని పడిపోతే తిరిగి అతికించడానికి చిత్ర బృందం చాలా కష్టపడినట్లు తెలిసింది. ఏది ఏమైనా ఆ సన్నివేశం అనుకున్నట్టే వచ్చిందని చిత్ర బృందం తెలిపింది. అత్తారింటికి దారేది లో కృతిమ చెట్టుని వాడి నవ్వులను పండించారు. ఇందులో సీరియస్ ని తీసుకురానున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 11 న రిలీజ్ కానుంది. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్నఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.