Trivikram: వైరల్ అవుతున్న మాటల మాంత్రికుడి నయా లుక్.. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడో?

అరవింద సమేత, అల వైకుంఠపురములో, గుంటూరు కారం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకు ఏడాది సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది. బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.

ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి విజయం సాధించాయి. బన్నీ త్రివిక్రమ్ కాంబో తర్వాత మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాల్సి ఉంది. గుంటూరు కారం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.

మరోవైపు ఎప్పుడూ గడ్డంతో కనిపించే త్రివిక్రమ్ శ్రీనివాస్ చిరంజీవి, హారిక హాసిని క్రియేషన్స్ అధినేత చినబాబుతో కలిసి దిగిన ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు చిరంజీవి త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఈ కాంబినేషన్ దిశగా అడుగులు పడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బన్నీ సినిమా మొదలయ్యేలోగా (Trivikram) త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమాను పూర్తి చేసే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. బాక్సాఫీస్ ను షేక్ చేసేలా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. బన్నీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus