ఎన్టీఆర్ తరువాత త్రివిక్రమ్ ఆ హీరోతోనే .. ఇది ఫైనల్?

ఈ ఏడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి1’ చిత్రం కలెక్షన్లనే అధిగమించింది. అంత బిగ్గెస్ట్ హిట్ సినిమా అందుకున్న తరువాత.. ఇప్పుడు ఎన్టీఆర్ తో ఓ సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్. పొలిటికల్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథాంశంతో ఈ చిత్రం ఉండబోతుందని ఇప్పటికే ప్రచారం నడుస్తుంది. ఇది పక్కన పెడితే.. మరో ‘ఆర్.ఆర్.ఆర్’ హీరో చరణ్ తో కూడా త్రివిక్రమ్ ఓ సినిమా చెయ్యాలి అని ట్రై చేస్తున్నాడట.

ఆ దిశగా ప్రయత్నాలు కూడా త్రివిక్రమ్ మొదలు పెట్టినట్టు తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఈ మధ్యనే రాంచరణ్ కు ఓ లైన్ వినిపించాడట త్రివిక్రమ్. ఆ లైన్ నచ్చడంతో ‘కచ్చితంగా సినిమా చేద్దాం’ అని చరణ్.. త్రివిక్రమ్ తో చెప్పాడట. నిజానికి త్రివిక్రమ్ .. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ కథను ముందుగా చరణ్ కే వినిపించాడట. అయితే ఎందుకో చరణ్ .. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రం చెయ్యలేదు. మళ్ళీ ఇన్నాళ్టికి చరణ్-త్రివిక్రమ్ కాంబో మళ్ళీ సెట్ అవ్వబోతుందంటూ ప్రచారం నడుస్తుంది.

మరి ఈసారైనా వీళ్ళ కాంబినేషన్లో సినిమా సెట్ అవుతుందా అనేది చూడాలి. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయ్యాక చరణ్.. దర్శకుడు సురేందర్ రెడ్డి తో ఓ సినిమా చెయ్యడానికి ఓకే చెప్పినట్టు ఇన్సైడ్ టాక్. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాకే త్రివిక్రమ్, చరణ్ ల సినిమా ఉంటుందని తెలుస్తుంది.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus