ఓకే షెడ్యూల్లో ఎన్టీఆర్ సినిమాని కంప్లీట్ చేయనున్న త్రివిక్రమ్.!

ఒక సినిమాని పూర్తి చేయడానికి మూడు, నాలుగు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. అయితే ఒక షెడ్యూల్లో సినిమాని కంప్లీట్ చేయడానికి త్రివిక్రమ్ (Trivikram NTR Movie) శ్రీనివాస్ సిద్ధమయ్యారు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత మాటల మాంత్రికుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నారు. ప్రీ పొడక్షన్ వర్క జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సోల్జర్ గా కనిపించబోతున్నారు. అందుకోసం తారక్ బాడీని పూర్తిగా మార్చివేస్తున్నారు. బాలీవుడ్ ఫిట్ నెస్ ఆధ్వర్యంలో అథ్లెటిక్ ఫిట్ బాడీని సాధిస్తున్నారు.

ఆ పనిలో ఎన్టీఆర్ నిమగ్నమై ఉంటే త్రివిక్రమ్ మాత్రం ఒక షెడ్యూల్ ల్లో సినిమాని ఎలా కంప్లీట్ చేయాలా? అని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తుండడంతో.. ఆ సినిమా కోసం ఈ చిత్రాన్ని వేగంగా కంప్లీట్ చేయాలనీ భావిస్తున్నారు. అందుకోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేయిస్తున్నారు. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలోనూ కొన్ని సన్నివేశాలను తెరకెక్కించడానికి అంతా రెడీ చేస్తున్నారు. డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. నాన్ స్టాప్ గా షూట్ చేయనున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తొలి సారి త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus