పవన్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న త్రివిక్రమ్..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుస విజయాలతో టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. చిన్న హీరోలతోనూ భారీ విజయాలను సొంతం చేసుకోగలరని ఈ డైరక్టర్ “అ..ఆ” సినిమాతో నిరూపించుకున్నారు. దీంతో అతని సినిమాలో నటించడానికి తెలుగు హీరోలు ఎదురుచూస్తున్నారు. నిర్మాతలు సైతం క్యూలో ఉన్నారు. అయినా త్రివిక్రమ్ మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు.

స్వతహాగా కథ, మాటలను రాయగల సత్తా ఉన్నా, పవర్ స్టార్ చెప్పిన కథను మూవీగా మలచడానికి మాటల మాంత్రికుడు ఒకే చెప్పాడు. ప్రస్తుతం ఆ కథకు స్క్రిప్ట్ రాసే పనిలో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో తమిళ చిత్రం వీరమ్ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని పవన్ భావిస్తున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు కూడా రెస్ట్ తీసుకోకుండా వెంటనే త్రివిక్రమ్ మూవీని పట్టాలెక్కించి ప్లాన్ లో పవర్ స్టార్ ఉన్నారు. త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్లో వచ్చిన జల్సా ఓ మోస్తరు విజయం అందుకోగా, రెండో సినిమా అత్తారింటికి దారేది రికార్డులను తిరగరాసింది.

ఈ మూడో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్రివిక్రమ్‌తో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యామూర్తి’, ‘అ..ఆ..’ సినిమాలు చేసిన ఎస్.రాధాకృష్ణ ఈ మూవీని కూడా నిర్మించేందుకు రెడీగా ఉన్నారు. ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన రావడానికి రెండు నెలలు పట్టవచ్చని ఫిలిం నగర్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus