Trivikram:త్రివిక్రమ్ కారణంగా క్రేజీ ఛాన్స్ పోగొట్టుకున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు హోల్డ్ లో పడిపోతుంటాయి. రీసెంట్ గా ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కూడా ఇలానే పక్కకు వెళ్లిపోయింది. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకున్నాడు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. కానీ ఊహించని విధంగా ఈ సినిమా హోల్డ్ లో పడింది. ఇప్పుడు త్రివిక్రమ్ తన తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయడానికి రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ తీసుకున్న డెసిషన్ కారణంగా యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి అప్సెట్ అయినట్లు తెలుస్తోంది.

మహేష్ హీరోగా ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తీశాడు అనీల్ రావిపూడి. ఆ సమయంలోనే మహేష్ తో మరో సినిమా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో మహేష్ కి ఓ లైన్ కూడా చెప్పాడు. ‘ఎఫ్ 3’ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ ప్రాజెక్ట్ మీదకు వెళ్లాలనుకున్నాడు. అన్నీ కుదిరితే ఈ ఏడాది సెప్టెంబర్ లో మహేష్-అనీల్ రావిపూడి సినిమా మొదలయ్యేది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా త్రివిక్రమ్ ఎంటర్ అవ్వడంతో మహేష్ అటు షిఫ్ట్ అయిపోయాడు.

తనతో ‘అతడు’, ‘ఖలేజా’ లాంటి సినిమాలు తీసిన త్రివిక్రమ్ తో చాలా కాలంగా సినిమా చేయాలనుకుంటున్నాడు మహేష్. ఇప్పుడు ఛాన్స్ రావడంతో ఓకే చెప్పేశాడు. ఈ ఏడాది ఆగస్టులో త్రివిక్రమ్ షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. దీంతో అనీల్ రావిపూడి సినిమా పక్కకు వెళ్లిపోయింది. పోనీ వచ్చే ఏడాదిలో చేద్దామంటే రాజమౌళి 2022లో మహేష్ సినిమా మొదలుపెడతానని చెప్పేశారు. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఇప్పట్లో అనీల్ రావిపూడికి మహేష్ డేట్స్ దొరకవు. దీని ప్రకారం.. అనీల్ రావిపూడి క్రేజీ ఛాన్స్ పోగొట్టుకున్నాడనే చెప్పాలి!

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus