అందరి అరచేతుల్లో…త్రివిక్రముడు!!

టాలీవుడ్ లో టాప్ దర్శకుల్లో కొందరి పేర్లు చెప్పండి అని అడిగినా?? టాలీవుడ్ లో డైలాగ్స్ ఎవరు బాగా రాస్తారో వారి పేర్లను కొన్నింటిని చెప్పండి అని అడిగినా ఆ చెప్పే సమాధానంలో తప్పక ఉండే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. కధ…మాటల రచయితగా టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసిన ఆయన ఎవ్వరిదగ్గరా అసిస్టెంట్ గా పనిచెయ్యకుండానే దర్శకుడి అవతారం ఎత్తాడు. అయితే అదే క్రమంలో తీసినవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ భారీ హిట్స్..ఇండస్ట్రీ హిట్స్ సినిమాలే తీశాడు. ఇది ఉంటే…ఆయన ను సినిమాల పరంగా అవార్డులు షరా మామూలుగానే వస్తాయి…అవన్నీ పక్కన పెడితే…ఏబీసీ డిజిటల్ మీడియా అనే టెక్నాలజీ సంస్థ త్రివిక్రమ్ ను అందరి చేతుల్లో ఉండేలా…ఆయనపై అభిమానంతో ఒక మొబైల్ యాప్ ను రూపొందించింది.

ఈరోజు ….అంటే నవంబర్ 7న త్రివిక్రమ్ బర్త్ డే కావడంతో ఈయనకు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ కంటెంట్ అని అందించే మొబైల్ యాప్ ను ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ పేరుతో మార్కెట్ లోకి ప్రవేశపెట్టనుంది. అయితే ఈ యాప్ లో ఏమేమి ఉంటాయి అంటే…ఆయన ప్రొఫైల్.. సినిమాల వివరాలు.. ఫోటో గ్యాలరీ.. స్పీచెస్.. అవార్డులు.. ఆయన సినిమాల్లోని పాటలు..వీటన్నింటినీ మించి అభిమానులు ఎక్కువగా ఇష్టపడే ఆయన డైలాగ్స్ ఉండేలా ప్లాన్ చేశారు ఆ సంస్థ వారు. అంతేకాకుండా త్రివిక్రమ్ తీసిన సినిమాలను కూడా పూర్తిగా యాప్ లోనే హై క్వాలిటీతో వీక్షించే సదుపాయాన్ని కూడా కల్పించారు. ఇక ఈ యాప్ ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ…అభిమానులకు త్రివిక్రమ్ ను మరింత దగ్గర చేసేలా ప్లాన్ చేస్తున్నారు మన ఏబీసీ డిజిటల్ మీడియా వారు…ఏది ఏమైనా….విలువలతో కూడిన సినిమాలు మనకు అందిస్తున్న మన త్రివిక్రమ్ గారికి ఈ అరుదైన గౌరవం దక్కడం నిజంగా హర్షించదగ్గ విషయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus