Trivikram: ఏపి ప్రభుత్వాన్ని ఏమీ అనలేదు అంటున్న త్రివిక్రమ్ టీం..!

  • November 27, 2021 / 05:26 PM IST

సోషల్ మీడియాలో సినిమా వాళ్ళ ఫోటోలు పెట్టుకుని వారి పేర్లతోనే అకౌంట్లు నడుపుతూ ఉంటారు కొంతమంది నెటిజన్లు. తద్వారా వాళ్ళ ఖాతాకి ఫాలోవర్లు పెరగడమే కాకుండా… వారు పోస్టులకు కూడా రీచ్ ఎక్కువ వస్తుందని వారి అభిప్రాయం. ఇదే విధంగా త్రివిక్రమ్ పేరుతో కూడా ఓ అకౌంట్ ఉంది. ఈ అకౌంట్ నుండీ ఏపీ ప్రభుత్వానికి ఓ ప్రశ్న వెళ్ళింది. అదేంటంటే.. “ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను నియంత్రిస్తోంది… సరే, అదే విధంగా స్కూల్ ఫీజులు, ఆసుపత్రుల ఖర్చులు కూడా తగ్గిస్తుందా?

సినిమాల కన్నా జనాలకు అవి చాలా ముఖ్యమైనవి కదా” అంటూ ట్వీట్ రూపంలో ఓ ప్రశ్న వెళ్ళింది. ఈ ప్రశ్నని ఓ జర్నలిస్ట్ మంత్రి పేర్ని నాని వద్ద ప్రస్తావించాడు. దానికి ఆయన… “ముఖ్యమంత్రి జగన్ గారిని అడిగి త్రివిక్రమ్ కు బదులిస్తాను” అంటూ స్పందించాడు. దీని పై పత్రికల్లో కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో… త్రివిక్రమ్ టీం అలెర్ట్ అయ్యి… “త్రివిక్రమ్ గారికి సోషల్ మీడియాలో ఖాతా లేదు. ఎవరో ఆయన ఫోటో పెట్టుకొని ట్వీట్లు చేస్తే వాటికి మాకు సంబంధం లేదు.

త్రివిక్రమ్ గారికి సంబంధించిన విషయాలన్నీ ‘హారిక & హాసిని’, ‘ఫార్చూన్ ఫోర్’ హ్యాండిల్స్ లో మాత్రమే లభిస్తాయి.దయచేసి గమనించగలరు” అంటూ చెప్పుకొచ్చారు. నిజంగానే ఆ అకౌంట్ త్రివిక్రమ్ ది కానప్పుడు ఆయన ఎక్క్లూసివ్ పిక్స్ అన్నీ అందులోనే ఎలా లభిస్తున్నాయి అనేది ఒక ప్రశ్న అయితే… ! త్రివిక్రమ్ పేరుతో ఓ ప్రశ్న వస్తే దానికి సమాధానం చెప్పే జ్ఞానం కూడా లేదా జగన్ ను అడిగి చెప్తావా? పేర్ని నాని పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ఈ టాపిక్ మరింత వైరల్ అవుతుంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus