చైతూ మూవీ కోసం పెన్ కదిపిన మాటల మాంత్రికుడు

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఎంతో ఇష్టపడి చేసిన సినిమా “ప్రేమమ్”. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై చైతు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో హీరో టీనేజ్, యంగ్, మిడిల్ ఏజ్ లో ప్రేమలో పడనున్నాడు. ప్రేమించబడే హీరోయిన్లుగా శృతిహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు.

సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. నాగ్  తన మాటలతో కథను నడిపించనున్నాడు. ఆ వాయిస్ ఓవర్ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్ కదిపాడని తెలిసింది. అద్భుతమైన మాటలు రాశారట. అవి ప్రేమమ్ కి కొత్త ఆకర్షణను తీసుకొచ్చాయని  చిత్ర బృందం వెల్లడించింది. విక్టరీ వెంకటేష్ కీలక రోల్ పోషించిన ఈ మూవీ  దసరా కానుకగా  అక్టోబర్ 7న విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=gttNM1A9XmA

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus