‘boycott83’ ట్రెండ్ చేస్తోన్న నెటిజన్లు!

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ’83’. 1983 వన్డే ప్రపంచకప్ విజయం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఏడాది క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కోసమే హోల్డ్ లో పెట్టారు. ఫైనల్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రణవీర్ సింగ్.. కపిల్ దేవ్ పాత్రను పోషించగా.. ఆయన భార్య పాత్రలో దీపికా పదుకోన్ కనిపించింది. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను విష్ణువర్ధన్ ఇందూరి నిర్మించారు.

అయితే ఈ సినిమాను ట్విట్టర్ లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. boycott83 అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. కబీర్ సింగ్ ఎంతో బాగా సినిమా తీశారని క్రిటిక్స్ ప్రశంసించారు. నేరేషన్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. మౌత్ టాక్ కూడా బాగుంది.

ఇందులో ఎలాంటి వివాదాస్పద ఎలిమెంట్స్ లేవు. అలాంటప్పుడు ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని ట్రెండ్ చేస్తుండడం ఆశ్చర్యకరం. సుశాంత్ రాజ్ పుత్ అభిమానులు ఈ సినిమాను ట్రోల్ చేస్తుండడం గమనార్హం. సుశాంత్ మరణానికి సంబంధించి అభిమానుల సందేహాలకు సమాధానాలు లభించకపోవడం.. బాలీవుడ్ లో ఉన్న స్టార్స్ మాఫియా వలనే సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడనే అభిప్రాయంలో అభిమానులు ఉన్నారు.

దీంతో బాలీవుడ్ నుంచి ఏ పెద్ద సినిమా విడుదలైన నెగెటివ్ ట్రెండ్స్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సైతం ట్రోలింగ్ బారిన పడ్డారు. ఇప్పుడు రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ ల మీద కోపంతో ’83’ సినిమాకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రభావం సినిమాపై పడుతుందేమో చూడాలి!

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus