నిన్నటి శివరాత్రి రోజున అందరూ ఏం చేస్తారు. అన్ని రోజులూ ఎలా ఉన్నా కానీ.. ఈరోజున మాత్రం ఎంతో పవిత్రంగా ఉంటారు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి.. గుళ్లకు వెళ్లి పూజలు చేయడం.. నాన్ వెజ్ కు దూరంగా ఉండడమే కాకుండా.. రాత్రంతా జాగారాలు చేయడం. ఇలా చేయడం ద్వారా సంవత్సరమంతా మంచి జరుగుతుంది అనేది అందరికీ బలమైన నమ్మకం. ఇక మన సినీ సెలబ్రిటీలు సైతం అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపి ఇవే పూజలు, జాగారాలు చేశారు. ఇంతకు మించిన భక్తి ఏం చూపిస్తాం.. అని అందరూ అనుకునే లోపే ఓ టీవీ నటి మాత్రం తన వీపు పై టాటూ వేయించుకుని హాట్ హాట్ గా ఫోజులివ్వడం సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. హిందీ టీవీ నటి కవితా కౌశిక్ మహాశివరాత్రి రోజుని ఎంతో ప్రత్యేకంగా చేసుకుందట. అంతేకాదు ఆ భక్తిని మహా శివుని టాటూతో చూపించి అందరికీ షాకిచ్చింది. దీనికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ టాటూలో ‘మహాశివుడు తన చేతితో ఢమరుకాన్ని పట్టుకున్నట్టువున్నాడు’. ఈ టాటూ ని తన వీపు పై వేయించుకుని ఫోటో తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది కవితా కౌశిక్. ఈ ఫోటీని షేర్ చేయడంతో ‘హరహర మహాదేవ్ కీ జై, ఈ బ్లవుజ్ రూపొందించిన వీణాకు ధన్యవాదాలు’ అంటూ పేర్కొని అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపింది. అయితే రక్తితో ఇలా భక్తిని ప్రదర్శించడం అవసరమా అంటూ కొందరు నెటిజన్లు ఈమెను ట్రోల్ చేస్తున్నారు.
1
2
3
4
5
Most Recommended Video
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!