మీ పని మీరు చూసుకోండి : అనసూయ

‘జబర్దస్త్’ హాట్ యాంకర్ అనసూయ ఇటీవల కొందరి నెటిజన్ల పై ఫైర్ అయ్యింది. మీ పని మీరు చూసుకోండి అంటూ ఘాటుగా స్పందించింది. అదేంటి అనసూయ ఇలా ఎందుకు మండిపడి ఉంటుంది అనే గా మీ డౌట్.? విషయంలోకి వెళితే… ఇటీవల ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో ‘సీఆర్పీఎఫ్’ జవానుల పై జరిగిన తీవ్రవాద దాడిలో 49 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన కు స్పందిస్తూ చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. మరో సర్జికల్ స్ట్రైక్ కావాలని కొందరు… పాకిస్థాన్ పై యుద్ధం ప్రకటించాలని మరికొందరు ఆగ్రహానికి గురయ్యారు.

ఈ లిస్టులో అనసూయ కూడా ఉంది. ఈ ఘటన జరిగిన రోజున స్పందించడంతో పాటూ…. దీని పై ఇప్పటివరకూ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో చాలా పోస్టులే పెట్టింది. ఈ అంశం పైన పోస్టులుపెట్టడంతో పాటూ తన రెగ్యులర్ ఫోటోలను కూడా షేర్ చేసింది. అదే రోజున తన ఫోటోలను షేర్ చేయడం పై కొందరు నెటిజనులు ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. ‘ఒకవైపు పుల్వామా దాడి గురించి అందరూ బాధపడుతుంటే… నువ్వు ఇలా రెడీ అయ్యి ఫోటోలు పోస్ట్ చేస్తావా’ అంటూ విమర్శలు చేసారు. దీనికి అనసూయ స్పందిస్తూ… “ఆ సంఘటన తర్వాత మీరు స్నానం చేయడం మానేశారా..? అన్నం తినడం మానేశారా? మరి నా డ్రస్ కు ఆ ఇన్సిడెంట్ కు సంబంధం ఏంటి? ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే నా డ్యూటీ.. నా డ్యూటి నేను చేయడంలో తప్పేముంది.. మీరు కూడా మీ పని చూసుకోండి” అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది అనసూయ. అయితే ఆమె ఇచ్చిన ఈ జవాబుని కొందరు సమర్దిస్తుంటే… మరికొందరు అనసూయ పై మళ్ళీ ట్రోల్ చేయడం మొదలుపెట్టడం గమనార్హం..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus