Satya Dev Remuneration: రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరో!

Advertisement

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో సత్యదేవ్ ఒకరు. సరైన హిట్లు పడక ఇమేజ్ రాలేదు కానీ టాలెంట్ పరంగా అతడికి ఎలాంటి లోటు లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. గత నెల దసరా కానుకగా విడుదలైన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని డామినేట్ చేసే పెర్ఫార్మన్స్ తో షాకిచ్చారు సత్యదేవ్. రీసెంట్ గా బాలీవుడ్ లో విడుదలైన ‘రామ్ సేతు’ సినిమాలో కీలకపాత్రలో కనిపించారు.

ఈ సినిమా హిట్ కానప్పటికీ.. సత్యదేవ్ కి మంచి పేరొచ్చింది. దీంతో ఇప్పుడు రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఇతడి పారితోషికం లక్షల్లోనే ఉంటుంది. ఇప్పుడు దాన్ని డబుల్ చేసినట్లు తెలుస్తోంది. తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నప్పటికీ.. కొత్తగా ఒప్పుకునే సినిమాలకు మాత్రం రెమ్యునరేషన్ పెంచి చెబుతున్నారట. ఇండస్ట్రీలో కాస్త క్రేజ్ వచ్చినప్పుడే సంపాదించుకోగలరు. ఇప్పుడు సత్యదేవ్ కూడా అదే చేస్తున్నారు. ప్రస్తుతం తడి చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి.

అందులో కొన్ని ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమా ఒప్పుకున్నారు. అదే ‘ఫుల్ బాటిల్’. ఈ సినిమా టైటిల్, పోస్టర్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. కామెడీ నేపథ్యంలో సాగే సినిమాలా అనిపిస్తుంది. నిఖిల్ తో ‘కిరాక్ పార్టీ’, సత్యదేవ్ తో ‘తిమ్మరసు’ వంటి సినిమాలను రూపొందించిన శరన్ కొప్పిశెట్టి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

అతడే రైటర్ కూడా. రామాంజ‌నేయులు జ‌వ్వాజి సినిమాను నిర్మిస్తున్నారు. నవంబర్ 2న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటివరకు సత్యదేవ్ కి సోలో హీరోగా సరైన సక్సెస్ రాలేదు. కనీసం ఈ సినిమాతోనైనా హిట్ అందుకుంటారేమో చూడాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read