పగలు అసెంబ్లీ లో.. రాత్రి పబ్ లో మహేష్!

శ్రీమంతుడు మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమా భరత్ అనే నేను. ఈ మూవీ తాజా షెడ్యూల్ సోమవారం మొదలయింది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సిఎం క్యాంప్ ఆఫీస్ సెట్లో కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కావడంతో అంతా రాజకీయమే ఉందనుకుంటే పొరబాటే.. ఇందులో యూత్ ని ఆకట్టుకునే ప్రేమకథ ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. అందుకోసమే మహేష్ పబ్ కి వెళ్ళారంట.

అసలు సీఎం రాత్రి వేళా పబ్ కి ప్రియురాలి కోసం వెలుతారా? ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపేందుకు వెళ్తారా? అనేది వెండి తెరపైనే చూడమని డైరక్టర్ చెబుతున్నారు. ప్రస్తుతం పబ్ సీన్లను షూట్ చేస్తున్నారు. ఇందులో మహేష్ ప్రియురాలిగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. పోసాని కృష్ణ మురళి కీలక రోల్ పోషిస్తున్నారు.  రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 20న రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న భరత్ అనే నేను పై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus