Chiranjeevi: ఆ హీరోయిన్ కి ఓటు వేస్తున్న మెగా ఫ్యాన్స్..!

  • December 11, 2023 / 07:48 PM IST

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. తన నటన, డాన్స్, యాక్షన్ తో కోట్లాది మందిని అభిమానులుగా మార్చుకున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన చిరు.. ఈరోజు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కొన్ని కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా..కొంత గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. రీఎంట్రీలో రీమేక్ సినిమాలు చేయడంతో సక్సెస్ కాలేకపోయారు చిరంజీవి.

రీసెంట్ గా చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఎలాగైనా సక్సెస్ ను సొంతం చేసుకోవాలని చిరంజీవి ప్రయత్నం చేస్తున్నాడు. చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు విశ్వంభ‌ర అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. సినిమాలో ఇద్ద‌రు, ముగ్గురు హీరోయిన్లు ఉంటార‌ని.. మెయిన్ హీరోయిన్ కోసం ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ అన్వేష‌ణ కొన‌సాగిస్తున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

మెయిన్ హీరోయిన్‌గా చిరు ప‌క్క‌న సీనియ‌ర్ హీరోయిన్ అయితేనే క‌రెక్టుగా సెట్ అవుతుంద‌ని అంటున్నారు. అందుకే త్రిష‌తో పాటు అనుష్క పేర్లు ప‌రిశీలిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్ద‌రు హీరోయిన్లు కూడా గ‌తంలో చిరు ప‌క్క‌న న‌టించారు. త్రిష స్టాలిన్ సినిమాలో న‌టించ‌గా.. అనుష్క అదే సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో డ్యాన్స్ చేసింది. ఆ సాంగ్‌లో చిరుతో క‌లిసి స్టెప్పులు వేసింది. ద‌ర్శ‌కుడు వ‌శిష్టతో పాటు మేక‌ర్స్ త్రిష లేదా అనుష్క‌లో ఎవ‌రిని ఫైన‌లైజ్ చేయాలా అని బాగా తిక‌మ‌క ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

చిరు (Chiranjeevi)   అభిమానులు మాత్రం ఎక్కువుగా త్రిష ఇప్ప‌ట‌కీ మంచి ఫామ్‌లో ఉంద‌ని… పైగా ఇటీవ‌ల విజ‌య్ లియో సినిమాతో ఆమె సూప‌ర్ హిట్ కొట్టింద‌ని.. ఆమెనే హీరోయిన్గా తీసుకోవాల‌ని అంటున్నారు. దీనిపై ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ జ‌రుగుతోంది.ఈ భారీ బ‌డ్జెట్ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా… యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. రు. 200 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. రెండు పార్టులుగా ఈ సినిమా నిర్మాణం కానుంది అనేది టాక్.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus