తెలుగు తెరపైకి 2 స్టేట్స్..!

భారతదేశ సరిహద్దులలోనే కాదు ప్రపంచంలో ఏ మూల ఓ సినిమా వచ్చినా, అది మన దర్శక నిర్మాతలకు నచ్చినా అక్కడికి కొద్దిపాటి కాల వ్యవధిలో అది తెలుగు తెరపై దర్శమిస్తుంది. ఇది వరకు ఇలాంటివి రహస్యంగా సాగినా ఇప్పుడు అంతర్జాల మహిమ అని అందరికీ తెలిసిపోతుంది. అంచేత మనవాళ్ళు కూడా ఓ ముందడుగేసి అసలు విషయాన్ని అధికారికంగా ప్రకటించేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఓ బాలీవుడ్ సినిమా ఇప్పుడు తెలుగు తెరపైకి రానుంది.

ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన ‘2 స్టేట్స్’ నవల ఆధారంగా అదే పేరుతో ఓ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అర్జున్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలుగా రూపొందిన ఈ రొమాన్స్ డ్రామా సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వివి వినాయక్ దగ్గర కో డైరెక్టర్ గా చేసిన వెంకట్ కుంచెం ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ రీమేక్ రైట్స్ ఇవ్వడం ఇదే ప్రప్రథమం. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించనున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus