కొవెర హీరోగా తనికెళ్ల భరణి, `శుభలేఖ` సుధాకర్ ముఖ్య పాత్రధారులుగా రూపొందిన చిత్రం `యు`. దీనికి ఉపశీర్షిక `కథే హీరో`. శ్రీమతి నాగానిక సమర్పణలో కొవెర క్రియేషన్స్ పతాకంపై కొవెర దర్శకత్వంలో విజయలక్ష్మి కొండా, నాగానికి చాగారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటోంది.
నిర్మాతలు విజయలక్ష్మి కొండా, నాగానికి చాగం రెడ్డి మాట్లాడుతూ “ `యు` అంటే అండర్ వరల్డ్. ఇప్పటివరకూ అండర్ వరల్డ్ కాన్సెప్ట్ తో
చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ఈ తరహాలో ఎవరూ చేయలేదు. హాలీవుడ్‌లో కూడా ఈ తరహాలో రాలేదు. ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌గారు ఈ కథ విని తన సలహాలు , సూచనలు ఇచ్చారు. ఇందులో మొత్తం నాలుగు పాటలున్నాయి. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. జూలై నెలాఖరున గానీ, ఆగస్టు మొదటివారంలో గానీ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అని తెలిపారు.
హీరో – దర్శకుడు కొవెర మాట్లాడుతూ “8కె కెమెరాతో షూటింగ్ మొత్తం జరుపుకొన్న తొలి తెలుగు సినిమా మాదే. నాకు తెలిసి ఇండియాలో కూడా ఇదే తొలి సినిమా అవుతుంది. 2017మే నెలలో రెడ్ హీలియమ్ 8కె కెమెరా విడుదల కాగా, మేం ఆగస్టు నుంచి ఆ కెమెరాతో షూటింగ్ స్టార్ట్ చేశాం. మా తర్వాత ఈ కెమెరాతో కొన్ని సినిమాలు షూట్ చేసినా పాటలకు, కొన్ని ఎపిసోడ్స్ కు మాత్రమే పరిమితమయ్యారు. హై క్వాలిటీ అవుట్‌పుట్ కావడంతో బిగ్ బిడ్జెట్ సినిమా రేంజ్‌లో చాలా 4 టీబీ హార్డ్ డిస్క్ లు ఉపయోగించాం. 8 కె వల్ల సినిమా క్వాలిటీ ఎక్స్ ట్రార్డినరీగా వచ్చింది. ఇది చాలా చిన్న సైజ్ కెమెరా. లైట్స్ ఎక్కువ వాడకుండా ఎలాంటి షాట్స్ నైనా చాలా ఈజీగా తీసేయొచ్చు. మా కెమెరామేన్ రాకేష్ గౌడ్ ఈ కెమెరా గురించి చెప్పాడు. రాకేష్ గౌడ్ కి కెమెరామేన్‌గా ఇదే తొలి సినమా. ఆయన ఇంతకు ముందు రామ్‌గోపాల్‌వర్మ తీసిన కొన్ని సినిమాకు డీఐ వర్క్ చేశారు“ అని చెప్పారు.