సెప్టెంబర్ 5న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నట్టు అధికారిక ప్రకటనలు వచ్చాయి. ఇందులో తేజ సజ్జ ‘మిరాయ్’, అనుష్క ‘ఘాటి’, శివకార్తికేయన్ ‘మదరాసి'(డబ్బింగ్ సినిమా), విజయ్ ఆంటోని ‘భద్రకాళి’, రష్మిక మందన ‘ది గర్ల్ ఫ్రెండ్’ వంటి సినిమాలు సెప్టెంబర్ 5 నే రిలీజ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటనలు వచ్చాయి. కానీ తర్వాత ఊహించని విధంగా విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ వెనక్కి వెళ్ళింది. అలాగే రష్మిక మందన ‘ది గర్ల్ ఫ్రెండ్’ కూడా పోస్ట్ పోన్ అయ్యింది.
ఇక తేజ సజ్జ ‘మిరాయ్’ సైతం సెప్టెంబర్ 12 కి వెళ్లే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. సో ఫైనల్ గా సెప్టెంబర్ 5 కి 2 పెద్ద సినిమాలు పోటీపడుతున్నాయి. అవే అనుష్క ‘ఘాటి’, శివకార్తికేయన్ ‘మదరాసి’. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ‘మదరాసి’ పై కూడా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే శివ కార్తికేయన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అయితే ఈ సినిమాల దర్శకులకు ఒక రకంగా సెప్టెంబర్ 5 యాసిడ్ టెస్ట్ వంటి పీరియడ్ అనే చెప్పాలి.
ముందుగా ‘ఘాటి’ విషయానికి వస్తే.. దీనికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ‘హరిహర వీరమల్లు’ వంటి పెద్ద సినిమా నుండి తప్పుకుని అతను చేసిన సినిమా ఇది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత అనుష్క చేసిన సినిమా కూడా ఇదే. ట్రైలర్లో క్రిష్ మార్క్ ఎక్కడా కనిపించలేదు. ఫేడౌట్ దశకు దగ్గరగా ఉన్న మాస్ డైరెక్టర్ చేసిన సినిమాలా అనిపిస్తుంది. కానీ అనుష్క ఉంది కాబట్టి.. మంచి ఓపెనింగ్స్ తీసుకునే అవకాశం ఉంది. ‘హరిహర వీరమల్లు’ పెద్ద డిజాస్టర్ అయినప్పుడు.. ‘క్రిష్ తప్పుకుని మంచి పని చేశాడు’ అని అంతా అనుకున్నారు. ‘ఘాటి’ హిట్ అయితేనే వారి అభిప్రాయం నిజం అవుతుంది. క్రిష్ గత చిత్రం ‘కొండపొలం’ కూడా ప్లాప్ అయ్యింది. క్రిష్ సినిమాల మార్కెట్ కూడా డౌన్ అయ్యింది. కాబట్టి ‘ఘాటి’ తో హిట్టు కొట్టి క్రిష్ మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి.
మరోపక్క ‘మదరాసి’ దర్శకుడు మురుగదాస్ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంది. విజయ్ తో చేసిన ‘కత్తి’ తర్వాత ఆయనకు సరైన హిట్టు లేదు. ‘సర్కార్’ కొంత పర్వాలేదు అనిపించినా ‘స్పైడర్’ ‘దర్బార్’ ‘సికందర్’ వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు ఫ్లాప్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ‘మదరాసి’ తో కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితిలో మురుగదాస్ ఉన్నారు. ఈ సినిమా హిట్ అయితే ఆయన ఫామ్లోకి వస్తారు. లేదు అంటే ఆయన ఫేడౌట్ దశకి చేరుకున్నట్టే.పైగా ‘సికందర్’ సినిమా డిజాస్టర్ అవ్వడం.. ఆ బ్లేమ్ అంతా మురుగదాస్.. సల్మాన్ ఖాన్ పై వేయడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. కాబట్టి సల్మాన్ అభిమానులు కానీ విశ్లేషకులు కానీ.. ‘మదరాసి’ ని భూతద్దం పెట్టి చూస్తారు అనడంలో సందేహం లేదు.