Udaya Kiran: ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు రాసిన లేఖలోని కామెంట్స్..!

ఉదయ్ కిరణ్.. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుండీ వచ్చి అతి తక్కువ టైములో.. అది కూడా లవ్ స్టోరీల సినిమాలతోనే స్టార్ హీరో అయిపోయాడు. అప్పటివరకూ తమ హవా కొనసాగిస్తున్న స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి వారు కూడా ఉదయ్ కిరణ్ కు ఏర్పడ్డ క్రేజ్ ను చూసి షాక్ అయ్యారు. ఉదయ్ నటించిన సినిమాలకి ప్లాప్ టాక్ వచ్చినా భారీ వసూళ్లు నమోదు చేసేవి. కలుసుకోవాలని, శ్రీరామ్, నీ స్నేహం వంటి సినిమాలు అతని ఇమేజ్ కారణంగానే బ్రేక్ ఈవెన్ సాధించాయి. అయితే ఎన్ని చెప్పుకుని ఏం లాభం..

అటు తర్వాత ఉదయ్ కిరణ్ స్టార్ డం అంతా ఒకేసారి పడిపోయింది. ఇక అతని మరణం కూడా పెద్ద మిస్టరీ. ఇదిలా ఉండగా… ఉదయ్ కిరణ్ ప్రాణాలు తీసుకునే ముందు ఓ లెటర్ కూడా రాసి పెట్టాడు. అందులో ఉదయ్ చేసిన కామెంట్లు కన్నీళ్ళు పెట్టించే విధంగా ఉన్నాయి. ఆ లేఖలో “విషిత మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో ఆ తర్వాత ఆ స్థాయిలో ఇష్టపడింది నిన్నే.అయితే మన మధ్య..గొడవల కారణంగా అంకుల్ ఆంటీ చాలా బాధ పడుతున్నారు. వారిని అంత బాధ పెట్టకూడదు.నువ్వు అతడు మంచివాడని నమ్ముతున్నావు. కానీ వాడు నువ్వనుకున్నంత మంచివాడైతే కాదు.

నా మాట విను… నువ్వు నిజం తెలుసుకున్న రోజు నీ పక్కన ఉదయ్ ఉండడు. నువ్వు ఒకసారి అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకో. నాకు సినీ ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు జరిగాయి.. నన్ను ఒక పిచ్చోడిని చేసి ఇండస్ట్రీ ఆడుకుంది. అయితే మన మధ్య గొడవల కారణంగా ఎంతో మంది బాధపడుతున్నారు. ఇలా అందరూ సంతోషంగా ఉండాలంటే నేను లేకపోవడమే కరెక్ట్.ప్రతి ఒక్కరికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అలా ఈరోజు నాకు ఎక్స్పైరీ డేట్ అని తెలుస్తుంది. అయితే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి ఆమెకు ఇచ్చెయ్యి…. ప్లీజ్.అమ్మ ఒక్కసారి నిన్ను గట్టిగా కౌగిలించుకుని ఏడవాలని ఉంది అందుకే నీ దగ్గరకు వస్తున్నాను” అంటూ పేర్కొన్నాడు ఉదయ్ కిరణ్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus