పవన్, త్రివిక్రమ్ సినిమాలో ప్రత్యేక సాంగ్ చేయనున్న ఉదయభాను!

జల్సా, అత్తారింటికి దారేది కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు మించి పవన్ కళ్యాణ్ 25 వ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో సీనియర్ నటి కుష్బూ కీలకరోల్ పోషిస్తుండగా విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర బృందంలో ఉదయభాను జాయిన్ కానుంది.  ప్రెగ్నెంట్ తర్వాత టీవీ షోలు, సినిమాలకు దూరమైనా ఉదయభాను.. కవలలు పుట్టడంతో మరింత బిజీ అయింది. ఇప్పుడు పిల్లలు పరవాలేదు అనుకొన్న తర్వాత మళ్ళీ బుల్లి తెర, వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తోంది. స్టార్ మాటీవీ లో డ్యాన్స్ ప్రోగ్రాం కి యాంకర్ గా చేస్తుండగా, త్రివిక్రమ్ సినిమాతో మళ్ళీ వెండితెరపై కనిపించనుంది.

ఇందులో ఒక స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలిసింది. గతంలో త్రివిక్రమ్ సినిమా జులాయిలోనూ ఉదయ్ భాను స్టెప్పులు వేసింది. ఇప్పుడు మరో మారు అలరించనుంది. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 10వ తేదీన రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus