ఉగాది సందడి ఆహా..ఓహో..!

తెలుగు సంవత్సరాది అంటే ఉగాది. ఈ పర్వదినం సందర్బంగా టాలీవుడ్‌ పరిశ్రమలో పలు చిత్రాలు ఏదో ఒకరూపంలో సందడి చేయనున్నాయి. ఆ రోజున పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న ‘సర్దార్‌గబ్బర్‌సింగ్‌’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్‌ నెంబర్‌వన్‌ స్థానం కోసం పోటీపడుతున్న పవన్‌, మహేష్‌లలో పవన్‌ తన చిత్రంతో రానుండగా, మహేష్‌ తాను నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మూెత్సవం’ టీజర్‌తో సందడి చేయనున్నాడు. ‘సర్దార్‌గబ్బర్‌సింగ్‌’ ఎలాంటి టాక్‌ తెచ్చుకుంటుంది? ఎంత మొత్తం ఓపెనింగ్స్‌ను సాధిస్తుంది? అని మెగాభిమానులు ఎదురుచూస్తుంటే మరోపక్క సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు అభిమానులు తమ హీరో నటిస్తున్న చిత్రం ట్రైలర్‌ ఎలా ఉంటుంది? దాన్ని ఎంతమంది చూస్తారు? అనే అంచనాలలో ఉన్నారు. ఇక నందమూరి బాలకృష్ణ తాను చేయబోయే 100వ చిత్రం వివరాలను ఉగాదికి అఫీషియల్‌గా ప్రకటించడానికి ముహూర్తం చూసుకున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్‌ను ఏప్రిల్‌ 22 నుండి సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి బాలయ్య సంసిద్దుడు అవుతున్నాడు. కాగా ఉగాది పర్వదినం రోజునే అక్కినేని అఖిల్‌ నటించనున్న రెండో చిత్రం విషయాన్ని నాగార్జున, అఖిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్‌ చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఇక చిరంజీవి నటించనున్న ‘కత్తి’ రీమేక్‌ విషయాన్ని కూడా చిరంజీవి ఉగాది పర్వదినాన వినాయక్‌తో కలిసి సంయుక్తంగా అనౌన్స్‌ చేయనున్నాడని సమాచారం. మొత్తానికి ఈ ఏడాది తెలుగు నూతన సంవత్సరాది చాలామందికి ఉత్సుకతను రేకెత్తిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus