‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ ఓ క్లాసిక్ మూవీ. ఇప్పటికీ బుల్లితెరపై ప్రసారమవుతూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది అని చెప్పాలి. ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంతో యశో సాగర్ హీరోగా డెబ్యూ ఇచ్చాడు. తర్వాత ఈయన ఓ యాక్సిడెంట్లో మరణించడం విషాదకరం. ఇదిలా ఉండగా.. ఈ సినిమాతో హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కూడా డెబ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె లుక్స్, నటన చూసి అంతా జూనియర్ ఐశ్వర్యారాయ్ అంటూ పొగిడారు. సినిమాలో కామెడీ,ఫ్యామిలీ ఎలిమెంట్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. క్లీన్ మూవీ అనుకోవచ్చు.
2008 జూన్ 25న పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 17 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 1.75 cr |
సీడెడ్ | 0.64 cr |
ఉత్తరాంధ్ర | 0.97 cr |
ఈస్ట్ | 0.39 cr |
వెస్ట్ | 0.31 cr |
గుంటూరు | 0.64 cr |
కృష్ణా | 0.47 cr |
నెల్లూరు | 0.38 cr |
ఏపీ+తెలంగాణ | 5.55 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 0.27 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 5.82 cr |
‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రం రూ.3.83 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే టోటల్ రన్లో రూ.5.82 కోట్ల షేర్ ను రాబట్టి.. బయ్యర్స్ కి రూ.1.99 కోట్ల లాభాలు మిగిల్చింది. అలా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ స్టేటస్ ను దక్కించుకుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ సినిమా నిర్మాతకు మరిన్ని లాభాలు దక్కాయి.