అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను ‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ‘శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్’ సంస్థపై బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్ బాబు సంయుక్తంగా దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ కు ముందు ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు లేవు.
కానీ 2014 జూలై 25న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. పాజిటివ్ టాక్ వల్ల ఓపెనింగ్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చాయి. నేటితో ‘అల్లుడు శీను’ రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 7.45 cr |
సీడెడ్ | 4.30 cr |
ఉత్తరాంధ్ర | 3.0 cr |
ఈస్ట్ | 1.42 cr |
వెస్ట్ | 1.35 cr |
గుంటూరు | 2.10 cr |
కృష్ణా | 1.36 cr |
నెల్లూరు | 0.92 cr |
ఏపీ+తెలంగాణ | 21.90 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 2.50 cr |
వరల్డ్ టోటల్ | 24.55 cr |
‘అల్లుడు శీను’ రూ.22.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. డెబ్యూ హీరోల్లో ఇంత బిజినెస్ చేసిన సినిమా ఇదే. టోటల్ రన్లో ఈ చిత్రం రూ.24.55 కోట్ల షేర్ ను రాబట్టింది. అది కూడా ఓ రికార్డ్ అనే చెప్పాలి. బయ్యర్స్ కి రూ.1.95 కోట్ల లాభాలు మిగిల్చి డీసెంట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.