సోషల్ మీడియా మూలానా.. అరచేతిలోనే అన్ని సమాచారం అందుతోంది. ముఖ్యంగా తమ అభిమాన హీరో సినిమా ఆప్టేట్స్ ఎప్పటికప్పుడు వచ్చేస్తున్నాయి. దీన్నే ఆధారం చేసుకొని కొంతమంది సినీ అభిమానులను బురిడీ కొట్టిస్తున్నారు. అటువంటి జాబితాలో ఉమైర్ సంధూ ముందు వరుసలో ఉన్నాడు. దుబాయి సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడినంటూ పరిచయం చేసుకొని.. ఒక రోజు ముందుగానే సినిమాల రివ్యూలు ఇస్తుంటాడు. బాలీవుడ్ నెంబర్‌వన్ ఫిల్మ్ క్రిటిక్ ఇచ్చిన రివ్యూ ఇస్తే అది కరెక్ట్ అని ఉమైర్ సంధూ చెప్పిన ట్వీట్ మాటలను ఆధారం చేసుకొని ఛానల్స్ సినిమా అలా ఉంది? ఇలా ఉంది అని ఊదరగొట్టేస్తాయి. ఇంకేముంది అభిమానులు అధిక రేట్లు ఇచ్చి టికెట్స్ కొనుగోలు చేస్తున్నారు.
తీరా సినిమాకి వెళ్తే అక్కడ సీన్ రివర్స్ అయి ఉంటుంది. ఉమైర్ సంధూ మళ్ళీ ముంచాడు అంటూ తలమీద చెయ్యి పెట్టుకొని రావడం ఈ మధ్య కామన్ అయిపోయింది. “బ్రహ్మోత్సవం” విషయంలో ఇలాగే జరిగింది. అతను సూపర్. బంపర్ అని రేటింగ్ ఇచ్చాడు. అది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తాజాగా “అజ్ఞాతవాసి” చిత్రానికి చిత్రానికి 5 స్టార్స్ కి నాలుగు స్టార్ రేటింగ్ ఇచ్చాడు. సినిమా థియేటర్ కి పోయినోడికి చుక్కలు కనిపించాయి. ఇకనైనా ఈ క్రిటిక్ ట్వీట్స్ ని ఛానల్స్, సైట్లు ప్రచారం చేయకుండా ఉంటే మంచిది. మోసపోయేవాళ్ల సంఖ్య తగ్గుతుంది.