సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా బయోపిక్ లను తెరకెక్కించారు. వీటిలో చాలా వరకు ప్రేక్షకులను మెప్పించాయి. అందుకే దర్శకనిర్మాతలు కూడా బయోపిక్ లను రూపొందించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడొక పోలీస్ ఆఫీసర్ బయోపిక్ ను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్లు. ఇంతకీ ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరంటే.. చదలవాడ ఉమేష్ చంద్ర. హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ట్రెయినింగ్ తీసుకున్న ఆయన పోలీస్ అధికారిగా జనాలకు బాగా దగ్గరయ్యారు.
జన జాగృతి పేరిట సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. వరంగల్ జిల్లాలో పనిచేసినప్పుడు అక్కడ నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండేది. ఏఎస్‌పీగా నక్సల్స్ ఏరివేత కొనసాగించారు ఆయన. ఆ తరువాత కడప జిల్లాలో పోస్టింగ్ వచ్చినప్పుడు అక్కడ ఫ్యాక్షనిజాన్ని సమూలంగా నిర్మూలించారు. అందుకే అక్కడి ప్రజలు ఆయన్ని కడప టైగర్ అని పిలిచేవారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఉమేష్ చంద్ర.. నక్సలైట్ల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. సెప్టెంబరు 4, 1999లో హైదరాబాద్ లో నడి రోడ్డుపై నక్సలైట్లు ఆయన్ని కాల్చి చంపారు.
పోలీస్ చరిత్రలో అదో దుర్దినంగా నిలిచింది. ఉమేష్ చంద్రను ఎక్కడైతే కాల్చి చంపారో అక్కడే.. మరుసటి ఏడాది ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇప్పటికీ ఎస్.ఆర్.నగర్ కూడలిలో ఆయన విగ్రహం ఉంది. ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా సినిమా తీయాలనుకుంటున్నారు. ఇందులో ఉమేష్ చంద్రగా నటుడు సోనూసూద్ కనిపించబోతున్నాడని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయిందని.. సోనూసూద్ కూడా సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపాడని టాక్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది.
Most Recommended Video
30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!