రవితేజకు గుర్తింపు తెచ్చిన రోల్స్

  • February 22, 2017 / 02:12 PM IST

సినిమానే శ్వాసగా బతికే నటుడు రవితేజ. టెక్నీషియన్ గా శ్రమిస్తాడు. ఆర్టిస్టుగా అదరగొడుతాడు. విలన్ పాత్ర అయిన సై.. జూనియర్ ఆర్టిస్టుగా నటించడానికి వెనుకాడడు. అంత ఇష్టం సినిమా రంగమంటే అతనికి. ఆ పిచ్చే అతన్ని హీరోగా చేసింది. మహా మహారాజ్ పేరుని తెచ్చిపెట్టింది. ఇంతవరకు అతను నటించిన సినిమాలో మరిచి పోలేని రోల్స్ పై ఫోకస్..

పవర్ ఫుల్ పోలీస్రవితేజ ద్వి పాత్రాభినయం చేసిన చిత్రం విక్రమార్కుడు. దొంగ అత్తిలి సత్తి బాబు, ఏఎస్పీ విక్రమ్ సింగ్ రాథోడ్ గా రెండు వేరియేషన్స్ ని చక్కగా పలికించారు. ఎమోషన్స్ సీన్స్, యాక్షన్ సీన్స్ లో విక్రమ్ సింగ్ రాథోడ్ గా రవితేజ నటన మాటల్లో వర్ణించలేము. పోలీస్ అంటే ఇలా ఉండాలని అని అందరూ అనుకునేలా చేశారు.

సరదా లెక్చరర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిరపకాయ్ సినిమాలో రవితేజది పోలీస్ రోల్ అయినప్పటికీ సినిమాలో ఎక్కువభాగం లెక్చరర్ గా కనిపించారు. హిందీ లెక్చరర్ గా హంగామా చేశారు. సరదాగా ఎంతో జోష్ గా సాగే ఈ పాత్ర కితకితలు పెట్టిస్తుంది.

జాలీ మంత్రిరాజకీయ నేత అనగానే హుందాగా ఉండాలి.. లౌక్యంగా మాట్లాడాలి.. అని చెబుతుంటారు. వాటిని ఫాలో అవకుండా రవితేజ తన మార్కు ఉత్సాహాన్ని జోడించి దరువు చిత్రంలో మంత్రిగా కిరాక్ పుట్టించారు.

మంచి దొంగ సరదా పాత్రలు చేయడం రవితేజకు అత్యంత సులువు. అటువంటి క్యారక్టర్ కి యాక్షన్ జోడిస్తే కిక్ వస్తుంది. కిక్ సినిమాలో కళ్యాణ్ గా పూర్తి జోష్ తో నటించి ఆడియన్స్ లో ఉత్సాహాన్ని నింపారు. మంచి దొంగను తన వెర్షన్లో చూపించారు.

మంచి కొడుకు పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో రవితేజ మంచి కొడుకుగా అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఇందులో అమ్మను ఆప్యాయంగా చూసుకునే కొడుకు చందు పాత్రకు రవితేజ ప్రాణం పోశారు.

నేటి కుర్రోడు చంటిగాడు లోకల్ .. ఈ డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. నేటి కుర్రోడిని రవితేజ ఇడియట్ సినిమాలో ఆవిష్కరించారు. ఇందులో చంటి పాత్రకు యువకులు కనెక్ట్ అయ్యారు. సాధారణమైన యువకుడిలా అతని నటన సూపర్. అందుకే ఈ చిత్రాన్ని విద్యార్థులు సూపర్ హిట్ చేయించారు.

దేశభక్తుడు క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం మూవీలో రవితేజ నటన అమోఘం. సరదాగా ఉండే యువకుల్లోను దేశభక్తి ఉంటుందని నటించారు. ఇందులో నటనకు తొలిసారి రవితేజ నంది అవార్డు అందుకున్నారు.

జర్నలిస్ట్ ఆంజనేయులు.. ఆ పేరులోనే ధైర్యం, మొండితనం అన్నీ ఉన్నాయి. అటువంటి స్వభావం ఉన్న యువకుడు జర్నలిస్ట్ అయితే ఆ పోస్ట్ కే పవర్ వస్తుంది. ఆంజనేయులు చిత్రంలో రిపోర్టర్ గా రవితేజ కామెడీని, యాక్షన్ ని పండించారు.

డైరక్టర్ సినిమా డైరక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి?, ఎన్ని అడ్డంకులను దాటుకోవాలి? ఎంతమందిని ఎదుర్కోవాలి? ఎన్ని త్యాగాలు చేయాలి? అనే విషయాలను పూరిజగన్నాథ్ నేనింతే చిత్రంలో చూపించారు. డైరక్టర్ అవ్వాలనే యువకుడిగా రవితేజ చక్కగా నటించి గుర్తిండిపోయారు.

మంచి స్నేహితుడు ఫ్రెండ్ ప్రేమని విజయవంతం చేయాలనీ తోటి ఫ్రెండ్స్ అనుకోవడం సహజం. స్నేహితుడి ప్రేమను గెలిపించాలని తన ప్రేమలో ఓడిపోయే మిత్రుడి పాత్రలో రవితేజ సహజంగా నటించి అభినందనలు అందుకున్నారు. శంభో శివ శంభో చిత్రంలో రవితేజ పోషించిన కరుణాకర్ పాత్రను మరచిపోలేము.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus