భానుమతీ రామకృష్ణ.. ఇప్పటి జనాలకు ఈమె పెద్దగా తెలియకపోవచ్చు కానీ అప్పట్లో ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలుగా, స్టూడియో అధినేత్రిగా, రచయిత్రిగా, గాయనిగా, సంగీత దర్శకురాలుగా ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకుంది. ఒంగోలులో పుట్టి పెరిగిన ఈమె.. 13ఏళ్ళ వయసులోనే ‘వరవిక్రయం’ అనే చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలోనే ప్రముఖ ఎడిటర్, నిర్మాత, దర్శకుడు పి. ఎస్. రామకృష్ణారావును వివాహం చేసుకుంది.వివాహం అయ్యాక కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన భానుమతి..
‘స్వర్గసీమ’ అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ తన హవా కొనసాగించారు. ఈ చిత్రం విజయవంతం కావడంతో భానుమతి ఇమేజ్ మునుపటి కంటే పెరిగింది అని చెప్పాలి. ఓ దశలో ఈమె అప్పటి స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ లను కూడా సైడేసేసింది అని చెప్పాలి. దాంతో వారి అభిమానుల్లో టెన్షన్ మొదలైంది అని కూడా చెప్పాలి. ‘చండీరాణి’ చిత్రంతో భానుమతి దర్శకురాలిగా మారింది. ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో నటించడమే కాకుండా హిందీ, తమిళ్,తెలుగు భాషల్లో నిర్మించడం అప్పట్లో సెన్సేషన్ అనే చెప్పాలి.
మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీ చేసి ఘనవిజయాన్ని సాధించిన ఘనత ఒక్క భానుమతి గారికే చెల్లింది.ఈ సినిమా కథ కూడా భానుమతిదే కావడం మరో విశేషం.ఇది మాత్రమే కాదు మరెన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి, డైరెక్ట్ చేసి విజయాలను సాధించి అప్పటి స్టార్ లు అయిన ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్, సావిత్రి వంటి వారికి షాక్ ఇచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారి అనేక హిట్ సినిమాల్లో నటించి అలా కూడా సక్సెస్ అయ్యారు భానుమతి.