హీరోయిన్ టు ఎమ్మెల్యే… రోజా గురించి మనకు తెలియని విషయాలు..!

శ్రీ లతా రెడ్డి…. ఈ పేరు చెబితే బహుశా ఎక్కువ మందికి తెలియదేమో అదే రోజా అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి అటు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పొలిటీషియన్ గా, ‘జబర్థస్త్’ జడ్జిగా రాణించిన రోజా ఈరోజు తన 49వ పుట్టినరోజుని జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె సినీ, రాజకీయ జీవితాల గురించి మనకి తెలియని విషయాలను తెలుసుకుందాం రండి :

1) రోజా చిత్తూరు జిల్లాకి చెందిన తిరుపతిలో జన్మించింది. 1972 వ సంవత్సరం నవంబర్ 17న నాగరాజ రెడ్డి, లలితా దంపతులకు జన్మించింది రోజా.

2) రోజా పుట్టిన కొన్నాళ్ళకి ఆమె ఈమె కుటుంబం హైదరాబాద్ కు షిప్ట్ అయ్యింది. అయితే రోజా తన డిగ్రీని తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో పూర్తి చేశారు.

3)హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు రోజా కూచిపూడి డాన్సర్ గా పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు.

4)హీరోయిన్ గా రోజా నటించిన మొదటి చిత్రం ‘ప్రేమ తపస్సు’.దివంగత నటుడు మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే ఆమె సినీ ప్రయాణం మొదలైంది ‘సర్పయాగం’ అనే చిత్రం ద్వారా.!

5)1992 వ సంవత్సరంలో ఇవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారత్నం గారి అబ్బాయి’ చిత్రం ఈమెకు మంచి బ్రేక్ ఇచ్చింది.

6) అటు తర్వాత ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్ళు, భైరవ ద్వీపం, గాండీవం, బొబ్బిలి సింహం, శుభలగ్నం వంటి చిత్రాలు రోజాకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.

7) ‘చెంబరుతి’ అనే చిత్రం ద్వారా తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది రోజా.సెల్వమణి ఈ చిత్రానికి దర్శకుడు.తనని తమిళ పరిశ్రమకి పరిచయం చేసిన సెల్వమణినే రోజా వివాహం చేసుకుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు.. ఒక పాప, ఒక బాబు. వాళ్ళ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

8)రోజా పొలిటీషియన్ గా కూడా సక్సెస్ అయ్యారు.కాకపోతే అందుకు ఎక్కువ సమయమే పట్టింది. మొదట తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన రోజా అటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. అయితే తర్వాత వై.ఎస్.ఆర్.సి.పి లో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొందారు రోజా.

9)ఓ పక్క రాజకీయాల్లో రాణిస్తూనే… పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ.. అదే విధంగా ‘జబర్దస్త్’ జడ్జిగా కూడా అలరిస్తున్నారు రోజా.

10)ఇటీవల రోజాకి చిన్నపాటి సర్జెరీ జరిగిన సంగతి తెలిసిందే. అయితే త్వరగానే కోలుకుని మళ్ళీ రాజకీయాల్లో ఇటు బుల్లితెర పై సందడి చేయడం మొదలుపెట్టారు.ఇలా అన్ని విధాలుగా బిజీగా ఉండే రోజా.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ.. తన ఫ్యామిలీ సంబంధించిన లేటెస్ట్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus