Sultan Movie: 24 ఏళ్ళ ‘సుల్తాన్’ గురించి 10 ఆసక్తికర విషయాలు!

కొన్ని కాంబినేషన్స్ సెట్ చేయాలంటే అయిపోవు. అందుకు అన్నీ కలిసి రావాలి. ఇద్దరు స్టార్లను డీల్ చేయడమే చాలా కష్టం. అలాంటిది ముగ్గురు స్టార్ హీరోలతో ఓ సినిమా ప్లాన్ చేయడం అంటే మాటలా. సీనియర్ దర్శకుడు శరత్ ఈ సాహసం చేశాడు. బాలకృష్ణతో ‘పెద్దన్నయ్య’ ‘వంశానికొక్కడు’ బ్లాక్ బస్టర్స్ అందించిన ఈ సీనియర్ దర్శకుడు బాలకృష్ణతో ‘సుల్తాన్’ అనే సినిమా ప్లాన్ చేశాడు అంటే సహజంగానే ఆ సినిమా పై అంచనాలు ఏర్పడతాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. ఈరోజుతో ‘సుల్తాన్’ సినిమా రిలీజ్ అయ్యి 24 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అందుకే సోషల్ మీడియాలో ‘ #24YearsForSultan ‘ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలో ‘సుల్తాన్’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) 1999 సంక్రాంతికి.. బి.గోపాల్ దర్శకత్వంలో చేసిన ‘సమరసింహారెడ్డి’ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు బాలయ్య. అయితే ఈ సినిమా కంటే ముందే ‘సుల్తాన్’ సినిమా చేయడానికి బాలయ్య సైన్ చేశారు.

2) కానీ ఎప్పుడైతే కృష్ణ, కృష్ణంరాజు వంటి స్టార్లు కూడా ‘సుల్తాన్’ లో భాగం కావాల్సి వచ్చిందో అప్పుడు.. ప్రీ ప్రొడక్షన్ పనులు పెరిగాయి.

3) బాలకృష్ణతో ‘బాలగోపాలుడు’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ఎం.ఆర్.వి ప్రసాద్.. బాలయ్యతో ఇంకో హిట్టు కొట్టాలని భావించి ‘సుల్తాన్’ నిర్మించడానికి రెడీ అయ్యారు. సో అన్ని రకాలుగా ఇది సూపర్ హిట్ కాంబినేషన్.

4) కానీ దర్శకుడు శరత్.. ముందుగా అనుకున్న కథ ఒకటి. బాలయ్య అయితే డైరెక్షన్ విషయంలో అస్సలు వేలుపెట్టే రకం కాదు. కానీ కృష్ణ, కృష్ణంరాజు వంటి బడా స్టార్లు కూడా ఈ ప్రాజెక్టులో నటించడానికి పరుచూరి బ్రదర్స్ ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది.

5) పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా సూపర్ స్టార్ కృష్ణ ఈ చిత్రంలో నటించారు.సిబిఐ ఆఫీసర్ గా రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించారు. ముందుగా కృష్ణంరాజు ఈ చిత్రంలో సిబిఐ ఆఫీసర్ పాత్రను చేయడానికి ఒప్పుకోలేదట.కానీ పోలీస్ ఆఫీసర్ గా కృష్ణ చేస్తున్నారు అని తెలిసి ఓకే చెప్పారట. వారి మధ్య స్నేహం గురించి అందరికీ తెలిసిందే కదా. పరుచూరి బ్రదర్స్ కూడా వారి పాత్రలను చాలా బాగా డిజైన్ చేశారు.

6) ‘సుల్తాన్’ లో బాలకృష్ణ డబుల్ రోల్ ప్లే చేశారు. హీరో అలాగే విలన్ కూడా ఆయనే. విలన్ రోల్ లో ఆయన 11 రకాల గెటప్ లు వేశారు. ఆ టైంలో అదొక సెన్సేషన్. బాలయ్య డెడికేషన్ కు మెచ్చుకోని వారంటూ లేరు.

7) ‘సుల్తాన్’ సినిమాకి సంబంధించి.. కృష్ణ- కృష్ణంరాజు- బాలకృష్ణ కాంబో సీన్స్ ఫస్ట్ తీసారట. బాలయ్య కోరిక మేరకు అలా చేయడం జరిగింది.

8) అండమాన్ దీవుల్లో ఈ చిత్రం షూటింగ్ జరిపారు.బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు.. వారి ఫ్యామిలీస్ తో కలిసి అక్కడకు వెళ్లారట. ఓ పక్క షూటింగ్ చేసినట్టు అలాగే ఫ్యామిలీతో ట్రిప్ వేసినట్టుగా కూడా ఉంటుందని అలా చేశారు.

9) అయితే అక్కడ లోకేషన్స్ సూపర్ గా ఉండేవి.. కానీ ఉండడానికి రాజీవ్ గాంధీ గెస్ట్ హౌస్ తప్ప.. ఏమీ ఉండేది కాదని… తినడానికి తిండి కూడా దొరికేది కాదని మేకర్స్ కొన్ని సందర్భాల్లో చెప్పారు.

10) అటు తర్వాత బియ్యం కూరగాయలు తెప్పిస్తే…. విజయనిర్మల, శ్యామల దేవి వంట చేసేవారట. బాలయ్య కూడా .. సముద్రంలో చేపలను వేటాడి విజయనిర్మల గారికి ఇస్తే.. ఆమె చేపల పులుసు చేసి వడ్డించేవారట. లొకేషన్ కు కూడా ఇంట్లో వండించుకుని తీసుకెళ్లేవారు. అలా కిందా మీదా పడి షూటింగ్ ను కంప్లీట్ చేశారు.

11) సమ్మర్ కానుకగా 1999 మే 27న సినిమాని రిలీజ్ చేశారు. మొదటి షోతోనే సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది. బాలయ్యని నెగిటివ్ యాంగిల్ లో ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. కానీ బాలయ్య నటన మాత్రం సూపర్.

12) కోటి అందించిన సాంగ్స్, నిర్మాణ విలువలు అన్నీ బాగుంటాయి. ఈ సినిమాకి బాలయ్య కూడా సమర్పకులుగా వ్యవహరించారు.

13) ‘సమరసింహారెడ్డి’ చూసిన కళ్ళతో (Sultan) ‘సుల్తాన్’ ను చూసిన అభిమానులకు ఈ సినిమా అస్సలు నచ్చలేదు. కానీ ముందు నుండి ఉన్న హైప్ కారణంగా ఓపెనింగ్స్ అయితే బ్రహ్మాండంగా వచ్చాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus