Munna Movie: 15 ఏళ్ళ ‘మున్నా’ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

  • May 3, 2022 / 01:09 PM IST

‘ఛత్రపతి’ తర్వాత ప్రభాస్ ఓ హిట్టు కొట్టడానికి చాలా కష్టపడ్డాడు. ఆ టైములో ఈ సినిమా కాకపోతే వచ్చే సినిమా కొడుతుంది అన్నట్టు ప్రభాస్ అభిమానులు ఎదురుచూశారు. 2006 లో ‘పౌర్ణమి’ ఎలాగూ కలిసి రాలేదు. ఆ మూవీతో వరుస హిట్లతో ఫామ్లో ఉన్న నిర్మాత యం.యస్.రాజు కి ప్లాప్ పడింది. 2007 లో వినాయక్ దర్శకత్వంలో ‘యోగి’, దిల్ రాజు నిర్మాణంలో చేసిన ‘మున్నా’ రెండు కూడా యావరేజ్ లు గా మిగిలాయి. ‘యోగి’ అనుకున్న ఫలితం ఇవ్వలేదు కాబట్టి ‘మున్నా’ కచ్చితంగా హిట్ అవుతుంది అని ప్రభాస్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశాభావం వ్యక్తం చేసాయి. కానీ అలా జరగలేదు. ఈ సినిమాకి రిలీజ్ కు ముందు నెలకొన్న హైప్ అంతా ఇంతా కాదు. అలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) ఇలియానాని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ఆ టైములో ఇలియానా నటిస్తే చాలు సినిమా సూపర్ హిట్ అవుతుంది అనేది ఓ నమ్మకం. ఈ సినిమా కోసం ఆ రోజుల్లోనే ఈమె రూ.80 లక్షలు పారితోషికం అందుకుంది.

2) దర్శకుడు వంశీ పైడిపల్లి అప్పటికే దిల్ రాజు వద్ద ‘భద్ర’ వంటి సూపర్ హిట్ సినిమాలకి పనిచేసాడు కాబట్టి… అతన్ని డైరెక్టర్ గా లాంచ్ చేయడానికి దిల్ రాజు రెడీ అయ్యారు.

3) నిజానికి దిల్ రాజు ‘మున్నా’ కంటే ముందు నుండీ ప్రభాస్ తో సినిమా చేయాలనుకున్నారు. ‘ఆర్య’ ‘భద్ర’ వంటి కథలు ప్రభాస్ కు వినిపించడం జరిగింది. కానీ ప్రభాస్ ఆ టైంలో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వలన చేయలేకపోయాడు.

4) అయితే వంశీ ఈ కథ మొదట దిల్ రాజుకి చెప్పినప్పుడు… ఈ కథ కొంచెం వెంకటేష్ నటించిన ‘సూర్య ఐ.పి.ఎస్’ సినిమాకి దగ్గరగా ఉంది అని చెప్పారట.

5) కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ మూవీ కథ ‘మున్నా’ కి దగ్గర పోలికలు ఉంటాయి.

6) సూర్య ఐ.పి.ఎస్ లో వెంకటేష్ కూడా తన తండ్రిని చంపాలి అని పగతో రగిలిపోతూ ఉంటాడు. ‘మున్నా’ లో కూడా అంతే హీరో ప్రభాస్ తన తండ్రిని చంపాలి అని పగతో రగిలిపోతూ ఉంటాడు. ఇద్దరూ కూడా హీరో తండ్రికి మొదటి భార్య కొడుకులే..!

7) దీంతో ‘మున్నా’ స్క్రిప్ట్ లో చాలా ఛేంజెస్ చేశారు. కొన్నాళ్ళు షూటింగ్ జరిగాక కూడా షూటింగ్ లో మార్పులు చోటుచేసుకున్నాయి.

8) ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన స్క్రిప్ట్ కు.. ఫైనల్ గా వచ్చిన అవుట్పుట్ కు చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అందువల్లనే ఫలితం తేడా కొట్టింది అని ఓ సందర్భంలో దిల్ రాజే చెప్పుకొచ్చారు.

9) హారిస్ జయరాజ్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘మనసా నువ్వుండే చోటే’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యింది.

10) మున్నా సినిమా అనుకున్న స్థాయిలో లేదు అనే వార్తని ప్రభాస్ తో చెప్పడానికి దిల్ రాజు చాలా ఇబ్బంది పడ్డారట. ‘నీకు హిట్ ఇవ్వలేకపోతున్నాను ప్రభాస్ ఐ యామ్ సారి’ అంటూ దిల్ రాజు ప్రభాస్ తో చెప్పినట్టు తెలుస్తుంది.

11) అయితే ‘మున్నా’ ప్లాప్ అయినప్పటికీ కొన్ని రికార్డులను కూడా కొల్లగొట్టింది. ఆ టైములో ‘మున్నా’ ఆడియో క్యాసెట్ల సేల్స్ విపరీతంగా అమ్ముడయ్యాయి.

12) 9 కేంద్రాల్లో ఈ మూవీ 100 రోజులు ఆడింది. ఒక్క ఉత్తరాంధ్ర ఏరియాలోనే ఈ మూవీ 10 కేంద్రాల్లో డైరెక్ట్ గా 50 రోజులు ఆడింది. అంతేకాకుండా అదే ఏరియాలో డైరెక్ట్ గా 2 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

13) ‘మున్నా’ ఆడియో రిలీజ్ కు ముఖ్య అతిధిగా అల్లు అర్జున్ విచ్చేసి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఆ టైములో దిల్ రాజు నిర్మాణంలో ‘పరుగు’ మూవీ చేస్తున్నాడు బన్నీ.

14) ఈరోజుతో ‘మున్నా’ సినిమా రిలీజ్ అయ్యి 15 ఏళ్ళు పూర్తి కాస్తోంది. ఈ చిత్రం దర్శకుడు వంశీ పైడిపల్లి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ళు పూర్తిచేసుకున్నాడు.ఇప్పుడతను ఓ స్టార్ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే. ‘మున్నా’ లో వంశీ కూడా చిన్న పాత్రలో కనిపిస్తాడు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus