Nava Vasantham Movie: 14 ఏళ్ళ ‘నవ వసంతం’ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..!

లవ్ స్టోరీలతోనే హిట్లు కొట్టి స్టార్ హీరో అయిపోయిన వాళ్ళలో ఉదయ్ కిరణ్ తర్వాత తరుణ్ ఒకడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన తరుణ్ హీరోగా మారి చేసిన మొదటి చిత్రంతోనే ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అటు తర్వాత ‘ప్రియమైన నీకు’ ‘నువ్వు లేక నేను లేను’ ‘నువ్వే నువ్వే’ వంటి హిట్లు కొట్టి స్టార్ హీరోలకి సైతం పోటీ ఇచ్చాడు. అయితే తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా చతికిల పడ్డాడు.

ఆ టైములో అతను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఒక్క సినిమా మాత్రం తరుణ్ కు కమర్షియల్ హిట్ ను అందించింది.అదే ‘నవ వసంతం’ చిత్రం. 2007 వ సంవత్సరం నవంబర్ 9న విడుదలైన ఈ చిత్రంలో తరుణ్ కు జోడీగా ప్రియమణి నటించింది. అంతేకాకుండా ఆకాష్, రోహిత్ వంటి ఫేడౌట్ అయిపోయిన హీరోలు కూడా నటించారు. వీళ్ళ వలన కానీ దర్శకుడు షాజహాన్ వలన కానీ ఈ సినిమా గట్టెక్కలేదు.

ఈ సినిమాలో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకడిగా నటించిన సునీల్ కామెడీ వలన గట్టెక్కింది. ‘సొంతం’ అంత కాకపోయినా ఈ సినిమాలో కూడా సునీల్ కామెడీ అదుర్స్ అనే చెప్పాలి. లాజిక్స్ పక్కన పెట్టి అతను చేసిన మిమిక్రీకి జనాలు ఎగబడి నవ్వారు. దాంతో రూ.3 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడవ్వగా.. ఫుల్ రన్లో రూ.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది ఈ చిత్రం.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus