సినిమాకి ఇంత బడ్జెట్ అయ్యింది అంత భారీ బడ్జెట్ అయ్యింది అంటూ దర్శకనిర్మాతలు చెప్పే ఫిగర్స్ అన్నీ ఫాల్స్ అని.. కేవలం పబ్లిసిటీ కోసమే అలా చెబుతారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం అనేంతగా ఎటువంటి ఆధారాలు లేవు. కానీ ఇన్నాళ్టికి ఆ వార్తల పై ఓ దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. అతను మరెవరో కాదు సెల్వ రాఘవన్. వివరాల్లోకి వెళితే.. 11 ఏళ్ళ క్రితం కార్తీ హీరోగా వచ్చిన ‘ఆయిరత్తిల్ ఒరువన్’( తెలుగులో ‘యుగానికి ఒక్కడు’) చిత్రాన్ని ఇతను తెరకెక్కించాడు.
తెలుగులో ఈ చిత్రం బాగానే కలెక్ట్ చేసింది. కానీ తమిళంలో మాత్రం యావరేజ్ ఎర్నర్ గా పరిగణించారు. సినిమాకి భారీ బడ్జెట్ పెట్టడం వల్ల ఆ మూవీ యావరేజ్ లిస్ట్ లోకి వేశారు. కానీ ఆ చిత్రానికి భారీ బడ్జెట్ అవ్వలేదని దర్శకుడు సెల్వ రాఘవన్.. ఇన్నేళ్ల తర్వాత చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.అతను ఈ విషయం పై స్పందిస్తూ .. “2010లో నా డైరెక్షన్లో వచ్చిన ‘యుగానికి ఒక్కడు’ చిత్రాన్ని రూ.18 కోట్లలోనే పూర్తి చేశాము. కానీ హైప్ కోసం దానిని భారీ బడ్జెట్ మూవీగా ప్రమోట్ చేశారు.
అప్పట్లో ఆ సినిమాకి రూ.32 కోట్ల బడ్జెట్ అయ్యింది. అది చాలా తెలివి తక్కువ పని.నిజానికి ఒరిజినల్ బడ్జెట్ తో పోల్చుకుంటే ఆ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. బడ్జెట్ ఎక్కువ చేసి చెప్పడం వలన వచ్చిన వసూళ్లతో ఆ మూవీని యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టారు ట్రేడ్ వర్గాలు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇన్నేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ ను కూడా తెరకెక్కిస్తున్నాడు ఈ దర్శకుడు. ధనుష్ ఆ మూవీలో హీరోగా నటిస్తున్నాడు.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!