‘బిగ్ బాస్’.. తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. 5 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి. ఇప్పుడు ఓటిటి సీజన్ మొదలైంది. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ పేరుతొ రన్ అవుతున్న ఈ షోలో సీనియర్ కంటెస్టెంట్ లతో పాటు చాలా మంది కొత్త కంటెస్టెంట్ లు కూడా వచ్చారు. వీళ్ళలో చాలా మంది గురించి ప్రేక్షకులకు తెలీదు. అందులో అజయ్ కుమార్ కతుర్వార్ ఒకరు. అసలు ఎవరు అజయ్ కతుర్వార్? ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలను ఓ లుక్కేద్దాం రండి :
1) అజయ్ కుమార్ కతుర్వార్ తెలంగాణ కుర్రాడే. 1990 వ సంవత్సరం జూలై 9న నిర్మల్ లో జన్మించాడు.
2) లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసాడు.
3) చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి పలు బ్రాండ్స్ కోసం పనిచేసాడు.
4) అటు తర్వాత పలు ‘స్నేహం’ వంటి పలు వెబ్ సిరీస్,షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు.
5) అజయ్ కుమార్ కతుర్వార్ హిందూ ఫ్యామిలీకి చెందిన వ్యక్తే.
6) పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అతని కొడుకు హీరోగా నటించిన ‘మెహబూబా’ చిత్రంతో ఇతను నటుడిగా పరిచయమయ్యాడు.
7) అటు తర్వాత ‘రాగల 24 గంటల్లో’ ‘అలనాటి సిత్రాలు’ ‘మిస్టేక్’ ‘విశ్వక్’ వంటి చిత్రాల్లో కూడా ఇతను నటించాడు.
8) ఇతని ఇన్స్టా ఖాతాకి 13వేలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇతను సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటూ ఉంటాడు.
9) ఇదిలా ఉండగా.. ఇతను హీరోగా నటిస్తూనే నిర్మాతగా కూడా ఓ సినిమా చేస్తున్నాడు. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలో అనేది ఇతని తపన. అందుకోసం ఎంతైనా కష్టపడతాను అంటున్నాడు.
10) బిగ్ బాస్ తనకి బాగా ప్లస్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తూ.. సంకీగాడు(మొండివాడు) హౌస్లో రాణిస్తానని చెప్పి హౌస్ లోకి వెళ్ళాడు ఈ కుర్ర నటుడు. గతంలో ఇతనికి పెద్ద యాక్సిడెంట్ కూడా అయ్యిందట. అప్పుడు 8 నెలల పాటు బెడ్ పైనే ఉండిపోయానని, మొత్తం పెరాలసిస్ లాగా కాళ్లు చేతులు పడిపోయాయని చెప్పుకొచ్చాడు.అయితే నాగార్జుననే ఇన్సిపిరేషన్ గా తీస్కుని ఓవర్ కమ్ అయినట్టు కూడా ఇతను తెలిపాడు.